టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న నటీమణులలో శ్రీదేవి ఒకరు. చిరంజీవి , శ్రీదేవి కాంబినేషన్లో రాఘవేందర్రావు దర్శకత్వంలో జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే ఈ మూవీ లో చిరంజీవి , శ్రీదేవి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

వీరి కాంబోలో జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా వచ్చిన తర్వాత కొంత కాలానికి వీరి కాంబోలో ఎస్పీ పరశురాం అనే సినిమా వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ మూవీ లో కూడా చిరంజీవి , శ్రీదేవి జంటకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే చిరంజీవి , శ్రీదేవి కాంబోలో ఓ మూవీ ఆల్మోస్ట్ సెట్ ఆ తర్వాత క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున హీరోగా శ్రీదేవి హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆఖరి పోరాటం అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మొదట రాఘవేంద్రరావు హీరో పాత్రలో నాగార్జునను కాకుండా చిరంజీవిని తీసుకోవాలి అనుకున్నాడట.

హీరోయిన్గా శ్రీదేవిని తీసుకోవాలి అనుకున్నాడట. ఇందులో భాగంగా చిరంజీవి , శ్రీదేవి కి రాఘవేంద్రరావు కథను వివరించగా వారు కూడా ఓకే చెప్పారట. కానీ కొన్ని కారణాల వల్ల చిరంజీవి చివరి నిమిషంలో ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. దానితో నాగార్జునను ఈ మూవీ లో హీరోగా ఎంపిక చేసుకున్నారట. అలా చిరు , శ్రీదేవి కాంబోలో ఆఖరి పోరాటం అనే సినిమా మిస్ అయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: