సినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన స్టోరీలో మరొకరు హీరోగా నటించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్మూవీ కథను రిజెక్ట్ చేయగా అందులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించి ఆ మూవీ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మరి తారక్ , బన్నీమూవీ కథను రిజెక్ట్ చేశారు. రవితేజమూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భద్ర అనే సినిమాలో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కథను మొదట బోయపాటి శ్రీను , అల్లు అర్జున్ కి వినిపించాడట. కథ మొత్తం విన్న అల్లు అర్జున్ స్టోరీ సూపర్ గా ఉంది. ఈ కథతో మూవీ తీస్తే మంచి విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ నేను ఇప్పటికే ఆర్య సినిమాకు కమిట్ అయ్యాను. ఆ మూవీ కంప్లీట్ కావడానికి చాలా సమయం పడుతుంది. మీరు అంత కాలం వెయిట్ చేయడం మంచిది కాదు. వేరే హీరోతో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పాడట. దానితో బోయపాటి శ్రీను ఇదే కథను తారక్ కి వినిపించాడట. కథ మొత్తం విన్న తారక్ కి ఆ సినిమా కథ పెద్దగా నచ్చలేదట. దానితో ఆ సినిమా చేయలేను అని చెప్పాడట. ఆ తర్వాత బోయపాటి శ్రీను , రవితేజ ను కలిసి ఈ మూవీ కథ మొత్తాన్ని వివరించాడట. రవితేజకు ఈ సినిమా కథ బాగా నచ్చడంతో వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక బోయపాటి శ్రీను ... రవితేజ హీరోగా భద్ర అనే టైటిల్ తో ఆ మూవీ కథను సినిమాగా రూపొందించగా ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా తారక్ , బన్నీ రిజెక్ట్ చేసిన కథతో రవితేజకు బ్లాక్ బస్టర్ విజయం దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: