ఏంటి సీనియర్ ఎన్టీఆర్హీరోయిన్ రెండో పెళ్లి చేసుకోవడం కోసం డబ్బుల కట్టలు సూట్ కేసులో ఇంటికి పంపించారా..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. నిజంగానే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో నోట్ల కట్టలు సూట్ కేసులో పంపించారా.. ఇంతకీ ఇందులో ఉన్న అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సీనియర్ ఎన్టీఆర్ బసవతారకాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చాలామంది హీరోయిన్ లని రెండో పెళ్లి చేసుకోవాలని చూసారంటూ ఆ మధ్యకాలంలో రూమర్లు వినిపించాయి. అంతేకాదు కృష్ణకుమారితో పెళ్లి పీటల వరకు వెళ్లారు. కానీ పెళ్లి చేసుకోవడానికి వస్తున్న కృష్ణకుమారిని ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు గన్ పెట్టి బెదిరించడంతో వెంటనే అక్కడి నుండి పారిపోయిందట.లేకపోతే ఆరోజు ఎన్టీఆర్ కృష్ణ కుమారిల పెళ్లి జరిగేదట. ఇక కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడా చివరికి ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోకుండా ఆపలేకపోయారు.

ఎందుకంటే చివరికి లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.. అయితే లక్ష్మీపార్వతి కంటే ముందే మరో హీరోయిన్ ని కూడా సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవాలని చూసారట.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు నటి వాణి విశ్వనాథ్.. సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి వాణి విశ్వనాథ్ సామ్రాట్ అశోక సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగానే కాదు దర్శకుడిగా..నిర్మాతగా..కూడా చేశారు. అలా ఆయన స్వీయ దర్శకత్వంలో, నిర్మాణం చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు ఈ సినిమాలో నటించిన వాణి విశ్వనాథ్ కి కూడా మంచి గుర్తింపు లభించింది.అంతేకాదు వయసులో ఎన్టీఆర్ కంటే వాణి విశ్వనాథ్ చాలా చిన్నది. అయినప్పటికీ ఏజ్ గ్యాప్ ఎక్కడ కూడా కనిపించకుండా ఎంతో అద్భుతంగా తెరమీద వీరి జోడి కనిపించడంతో అప్పట్లో వీరి జోడికి ఓ వర్గం ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

దాంతో వీరి జోడి కి తెరమీద మంచి గుర్తింపు లభించి మరిన్ని సినిమాలు వీరి కాంబోలో రావాలని అనుకున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన వాణి విశ్వనాథ్ ఆయన కంటే వయసులో దాదాపు 48 సంవత్సరాలు చిన్న. అయినా కూడా వయసు తేడా ఎక్కడా కూడా కనిపించదు. అయితే ఈ సినిమాకి ఎన్టీఆర్ నిర్మాతగా కూడా చేశారు కాబట్టి అందరికీ రెమ్యూనరేషన్ ఈయనే ఇస్తారు. అలా ఓరోజు వాణి విశ్వనాథ్ ఇంటికి డబ్బులు ఉన్న సూట్ కేసుని పంపారట. ఇక రెమ్యూనరేషన్ వచ్చిందని ఎంతో సంబరంతో సూట్ కేస్ ఓపెన్ చేసిన వాణి విశ్వనాథ్ కి షాక్ తగిలింది.

 ఎందుకంటే అందులో తనకి వచ్చే డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు ఉండడంతో వెంటనే ఫోన్ చేసి ఎక్కువ డబ్బులు పంపారండి అని చెప్పిందట.కానీ ఎన్టీఆర్ మాత్రం పర్లేదు ఉంచుకో అమ్మాయ్..ఇంటికి వచ్చిన లక్ష్మిని మళ్లీ తిరిగి పంపకూడదు అని చెప్పారట. అయితే ఈ విషయం అప్పట్లో వైరల్ అవ్వడంతో వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకుంటున్నారు అనే రూమర్లు తెరమీద వినిపించాయి. ముఖ్యంగా సామ్రాట్ అశోక సినిమాలో వీరి కెమిస్ట్రీ బాగుండడంతో పాటు ఈ సినిమా తర్వాత రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎన్టీఆర్ ఎక్కువ డబ్బులు ఇవ్వడంతో చాలామంది వీరి రెండో పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. కానీ వీరి రెండో పెళ్లి జరగలేదు.ఆ మాటలు రూమర్స్ గానే మిగిలిపోయాయి. చివరికి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: