
ఇక్కడ ఎన్ కన్వెన్షన్ డబ్బుకు సంబంధించిన విషయం .. ఇక మరో కొట్టి పరువుకు సంబంధించిన ఇష్యూ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఓ మహిళా మంత్రి నాగార్జున పై అత్యంత జుబ్క్ష కరమైన వ్యాఖ్యలు చేసింది . ఓ మహిళ అయ్యుండి అలా మాట్లాడటం సరికాదు చాలామంది ఆ సమయంలో అలా అభిప్రాయపడ్డారు కూడా దీనిపై కూడా నాగార్జున న్యాయ పోరాటానికి దిగారు . తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ పరువు నష్టం దావా కూడా వేశారు .. ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో నాగార్జునకు రెండు పెద్ద తగాదాలు నడుస్తున్నాయి ..
అయినప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కనపెట్టి తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో రేవంత్ రెడ్డి పక్కన కూర్చున్నాడు నాగార్జున .. తాజాగా మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భాగంగా తెలంగాణ బ్యూటీ అండ్ కల్చర్ను సెలబ్రేట్ చేసుకునే వేడుకలలో ఓకే టేబుల్ పై రేవంత్ , నాగార్జున కలిసి కనిపించారు . ఇక నిజానికి వీరిద్దరూ ఇలా కలవడం ఇదే మొదటిసారి కాదు . గతంలో టాలీవుడ్ పెద్దలు కొంతమంది వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో కూడా నాగార్జున ఉన్నారు .. ఆ సమయంలో నాగార్జున , రేవంత్ కు సాలువా కూడా కప్పారు .. ఈసారి ఓకే టేబుల్ షేర్ చేసుకున్నారు .. అందుకే ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా నాగార్జున , సీఎం రేవంత్ రెడ్డి జోడి ఎక్కువ మందిని ఎంతగానో ఆకర్షిస్తుంది .