జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ ఎన్నో టీవీ షోలలో యాంకర్ గా చేసి మంచి క్రేజ్ అందుకున్నారు.ఆ క్రేజ్ తో హీరోగా కూడా మారి పలు చిత్రాలలో నటించిన ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. తిరిగి మళ్లీ బుల్లితెర పైన ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుదీర్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. కానీ వివాహ విషయంలో మాత్రం అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సుడిగాలి సుదీర్ పెళ్లి గురించి ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అంటూ చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్న ఇప్పటివరకు అలాంటిదేమీ కనిపించలేదు. అయితే తాజాగా సుధీర్ ఇంట ఒక గుడ్ న్యూస్ అయితే వినిపిస్తోంది.


సుధీర్ తమ్ముడు రోహన్ , భార్య రమ్య తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది రమ్య. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు రోహన్. అలా తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ "ఇట్స్ బేబీ బాయ్ అంటూ క్యాప్షన్" కూడా జత చేయడం జరిగింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.


సుడిగాలి సుదీర్ అతని తమ్ముడు కుటుంబం అందరూ కూడా కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నారట. తన చెల్లెలు శ్వేత మాత్రం భర్తతో కలిసి విదేశాలలో స్థిరపడినట్లుగా తెలుస్తోంది. రమ్య ,రోహన్ కు గడిచిన కొన్ని ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఒక పాప కూడా జన్మించింది. అయితే ఇప్పుడు తాజాగా బాబు జన్మించారనే  విషయాన్ని తెలియజేస్తూ చాలా ఆనంద పడుతున్నారు రోహన్. మొత్తానికి సుడిగాలి సుదీర్ ఇంటికి వారసుడు వచ్చేసారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం GOAT అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఈ మధ్యకాలంలో రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: