హీరో గా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన నవీన్ చంద్ర ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించారు. అలా అరవింద సమేత, నేను లోకల్ వంటి సినిమాల్లో విలన్ గా చేసిన సంగతి మనకు తెలిసిందే.అలా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో పాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నారు.అయితే అలాంటి నవీన్ చంద్ర పై ఆయన బంధువులు, ఇరుగుపొరుగువారు  భార్యని టార్చర్ చేస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేస్తున్నారట.మరి ఇంతకీ నవీన్ చంద్ర ఎందుకు తన భార్యను టార్చర్ చేస్తున్నారు..ఇందులో ఉన్న అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.నవీన్ చంద్ర చాలా సినిమాల్లో సైకో భర్త క్యారెక్టర్ లో నటించిన సంగతి మనకు తెలిసిందే.అలా కలర్స్ స్వాతి తో చేసిన మంత్స్ ఆఫ్ మధు సినిమాలో భార్యని టార్చర్ చేస్తూ వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్న పాత్రలో కనిపిస్తాడు. అలాగే జిగర్ తండా మూవీలో కూడా ఇలాంటి ఒక సైకో పాత్రలోనే నటించారు.

 అంతేకాకుండా అమ్ము సినిమాలో భార్యపై అనుమానం పెంచుకొని సైకో పాత్రలో క్రూరంగా నటిస్తాడు. అలా కొన్ని సినిమాలలో భార్యను వేధిస్తూ శాడిస్ట్ లా సైకో పాత్రలో కనిపించిన నవీన్ చంద్రని చూసి ఇరుగుపొరుగు వాళ్ళు వీధిలో ఉన్నవాళ్లు బంధువులు కూడా చాలా భయపడి పోయే వారట. అంతే కాదు ఆయన ఎక్కడికైనా ఫంక్షన్ కి వస్తే ఆయనతో మాట్లాడడానికి కూడా వణికి పోయే వారట. ఇక కొంతమంది అయితే ధైర్యం చేసుకొని నవీన్ చంద్ర భార్య దగ్గరికి వెళ్లి సినిమాలో చూపించినట్టే ఇంట్లో కూడా మిమ్మల్ని మీ భర్త టార్చర్ చేస్తారా.. సినిమాల్లో ఆయన్ని చూస్తేనే భయం అవుతుంది. ఒకవేళ నిజంగా టార్చర్ చేస్తే మాకు చెప్పు.మాకు డిజిపి లాంటివారు చాలా దగ్గర.వారికి ఫిర్యాదు చేస్తాం అని అడిగారట.

అయితే ఇరుగుపొరుగు వాళ్ళ మాటలకి నవ్వుకున్న నవీన్ చంద్ర భార్య ఇంటికి వచ్చాక నవీన్ చంద్రతో ఈ విషయం చెప్పి కాలనీవాసులు ఇలా అనుకుంటున్నారు అని అన్నారట. ఇక భార్య చెప్పిన మాటలకు ఫిదా అయినా నవీన్ చంద్ర నేను నటించిన పాత్రలు ప్రేక్షకుల్లోకి ఇంత బలంగా వెళ్తాయి అనుకోలేదు. నన్ను ప్రేక్షకులు ఇంతలా గుర్తు పెట్టుకున్నారంటే నేను చేసిన పాత్రలు ప్రేక్షకుల్లోకి ఎంత బలంగా వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు అని అన్నారట అంతేకాదు ఆ తర్వాత ఎక్కడికి ఫంక్షన్స్ కి వెళ్ళినా కూడా తన బంధువులతో, ఇరుగుపొరుగు వాళ్లతో కూర్చొని తన సినిమాల గురించి పూర్తిగా చెప్పడంతో వాళ్ళు నవీన్ చంద్రని అర్థం చేసుకున్నారట.ఇక తాజాగా నవీన్ చంద్ర నటిస్తున్న లెవెన్ సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు.ఇక నవీన్ చంద్ర మలయాళీ సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసే ఓర్మా ని పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: