సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేయడం ..పెద్ద హాట్ టాపిక్ గా మార్చేయడం చూస్తూనే ఉన్నాము.  మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ విషయాలలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది . కాగా ఎప్పుడూ కూడా సైలెంట్ గా ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది.  మనకు తెలిసిందే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మొదటి రచయితగా తర్వాత డైరెక్టర్గా మారాడు . ఆయన రాసే కధలు.. వాడే పంచ్ డైలాగ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో.  ప్రతి ఒక్క సినిమాకి ఆయన మనసుపెట్టి డైలాగ్స్ రాస్తూ ఉంటారు .

మన నిజ జీవితంలో కూడా అవి బాగా అప్లికేబుల్ అవుతూ ఉంటాయి. కాగా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబో వేరే లెవెల్. ఈ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ . జులాయి సినిమా వీళ్ళకాంబలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ వేరే లెవెల్ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.  రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన పూజ గదిలో పూజ చేస్తూ ఉంటారు . అయితే అక్కడ బాగా గమనించినట్లయితే ఈ పూజ గదిలో అన్ని మతాల ఫోటోలో ఉంటాయి . అది పెద్ద తప్పేం కాదు అని ఓ వర్గం జనాలు మాట్లాడుకుంటుంటే.. కొంతమంది మాత్రం అలా హిందూ దేవుళ్ళ ఫోటోలు ఇతర మతల దేవుళ్ళ ఫోటోలతో ఎలా కలిపి పెడతావ్ అంటూ త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు .

అంతే కాదు రీసెంట్గా ఒక నెటిజెన్ దీనిపై సోషల్ మీడియాలో ఘాటుఘాటుగా పోస్టులు పెడుతున్నారు . త్రివిక్రమ్ కి అసలు సెన్స్ లేదా ..? మన హిందూ దేవాలయాన్ని తక్కువ చేస్తారా ..? అంటూ ఘాటుగా ఫైర్ అవుతున్నారు జనాలు . మరికొందరు ఏకంగా ఆయన ఇంకొకసారి ఇలా చేయకుండా ఉండాలి అంటే ఆయన అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు . మరి కొందరు మాత్రం గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పై  ఓ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని సోషల్ మీడియాలో మళ్లీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు .

మొత్తానికి ఎప్పుడు సైలెంట్ గా ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇలా ఊహించిన చిక్కుల్లో ఇరుక్కున్నారు . అంతేకాదు పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తే బాగుంటుంది అంటూ కొందరు పైశాచిక ఆనందం పొందుతూ కామెంట్స్ చేస్తున్నారు . ఇంత చిన్న విషయానికి అరెస్ట్ చేస్తారా..? ఇంతకన్నా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్లే బయట దర్జాగా తిరుగుతున్నారు అంటూ త్రివిక్రమ్ ఫ్యాన్స్ కూడా కౌంటర్స్ వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు పై హ్యూజ్ ట్రోళింగ్ జరుగుతుంది..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: