
అయితే ఇప్పుడిప్పుడే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై కొంచెం క్లారిటీ వచ్చే విధంగా సినిమా ఇండస్ట్రీలో జనాలు మాట్లాడుకుంటున్నారు. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం "క్రిష్" దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఆ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి మోక్షజ్ఞ ఎంటృఈ ఇవ్వబోతున్నాడు . ఆదిత్య 999 గా ఈ సినిమా తరికెక్క్బోతుందట . ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి . దీనిపై ఏది కూడా అఫీషియల్ అప్డేట్ లేదు . కాగా ఇదే మూమెంట్లో కొందరు ఆకతాయిలు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ని టార్గెట్ చేసుకొని ఆయన ఫిజికల్ చేంజ్ పై దారుణతి దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు .
మోక్షజ్ఞ ఒకప్పుడు చాలా చాలా బొద్దుగా ఉండేవాడు . అది అందరికీ తెలుసు . ఈ మధ్యకాలంలో చాలా చాలా స్లిమ్ గా మారిపోయాడు ఎంతలా అంటే .. అసలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే ఏ హీరో కూడా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ లుక్స్ కి సరిరారు . అంతలా హ్యాండ్సమ్ గా తయారయ్యాడు . అయితే ఇదంతా కేవలం బ్రాహ్మిణి వల్లే సాధ్యమైంది అని.. ఆమె స్పెషల్ డైట్ చేయించడం ద్వారానే మోక్షజ్ఞ ఇంత త్వరగా మారగలిగాడు అని జనాలు మాట్లాడుకున్నారు . కానీ అదంతా ఫేక్ అని ఎంత డైట్ ఫాలో అయిన ఇంత వెయిట్ లాస్ అనేది అనివార్యమని .. మోక్షజ్ఞకు బాలయ్య ఫారిన్ కంట్రీ లో సర్జరీ చేయించాడు అని ఆ కారణంగానే మోక్షజ్ఞ ఇంత స్లిమ్ గా తయారయ్యాడు అని సోషల్ మీడియాలో జనాలు మోక్షజ్ఞ లుక్స్ పై కౌంటర్స్ వేస్తూ మాట్లాడుకుంటున్నారు.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ పై కూడా ఇలాంటి కామెంట్స్ లో వినిపించేవి. బాగా బొద్దుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సడన్గా లావు తగ్గిపోయేసరికి ..ఆయన సర్జరీ చేయించుకున్నాడు అంటూ సినిమా ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు . ఆయన ఎటువంటి సర్జరీ చేయించుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు . ఇప్పుడు మోక్షజ్ఞ పై కూడా అలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇది ఫేక్ అంటూ నందమూరి ఫ్యాన్స్ కొట్టి పడేస్తున్నారు . బాలయ్యకి అలాంటి సర్జరీలు చేయించడం అన్న చేయించుకోవడం అన్న ఇష్టం లేదు అని .. బాలయ్య చాలా పక్కాగా ముందుకు వెళ్లే వ్యక్తి అని ఎవరో నందమూరి ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు మాత్రమే ఇలా చేస్తున్నారు అని.. మోక్షజ్ఞ చాలా కష్టపడి బరువు తగ్గాడు అని ..ఆయన సినీ జీవితంపై దెబ్బకొట్టే విధంగా ఎవరు ట్రోల్ చేయకపోవడం బెటర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!