
అయితే ఈ క్రమంలోనే రీ రిలీజ్ సినిమాలు మాత్రం గట్టిగా క్యూ కట్టాయి .. ఏకంగా నలుగురు టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు రీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి . వాటిలో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా మే 16న రిలీజ్ కు రాబోతుంది . ఇలా రెండు రోజుల గ్యాప్ లోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది .. మైత్రి మూవీస్ ఈ సినిమాలను నైజాంలో రీ రిలీజ్ చేస్తుంది . ఇక అలా వారం గ్యాప్ లోనే రెబల్ స్టార్ కెరియర్ లోనే మొదటి బ్లాక్ బస్టర్ వర్షం మే 23న థియేటర్లో సందడి చేయనుంది ..
అలాగే ఈ నెలాఖరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఖలేజా మే 30న రిలీజ్ కు రాబోతుంది .. అలాగే మే 31న మహేష్ మరో సినిమా అతిధి కూడా రీ రిలీజ్ అవుతుంది . ఇలా ఈ నెలలో చెప్పుకో దగ్గ సినిమాలు లేకపోవటంతో రీ రిలీజ్ సినిమాలకు మంచి దారి దొరికింది .. అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజ్ సినిమాలు అంతగా కలెక్షన్స్ అందుకోవటం లేదు .. అయితే ఇప్పుడు ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ఎంతవరకు కలెక్షన్స్ రాబడతాయో చూడాలి ..