కోలీవు డ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో సూర్య ఒకరు . ఈయ న కొంత కాలం క్రితం కంగువా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు . భారీ అంచనాల నడుమ విడుదల అయి న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిం ది . తాజాగా సూర్య , కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం లో రూపొందిన రేట్రో అనే సినిమాలో హీరోగా నటించా డు . పూజా హెగ్డేమూవీ లో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేకపోతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య , ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యమూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ను సూర్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వెంకీ ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో ఒక అద్భుతమైన కీలకమైన పాత్ర ఉన్నట్లు , అందులో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ ను తీసుకోవాలి అని వెంకీ అట్లూరి అనుకుంటున్నాట్లు , దానికి సూర్య మరియు నిర్మాత నాగ వంశం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని ఓకే అయితే సూర్య , వెంకీ , నాగ వంశీ కాంబో సినిమాలో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: