
అంతేకాకుండా సింగర్ కేనిషా, జయం రవి ఇద్దరూ కూడా పలు రకాల ఫంక్షన్ కి చట్టపట్టలేసుకొని తిరగడంతో వారి పైన కూడా ఫైర్ అయ్యింది ఆర్తి.. అయితే ఇలాంటి సమయంలోనే జయం రవి ఒక బిగ్ బాంబ్ పేల్చారు.. అదేమిటంటే తన జీవితంలో వెలుగు నింపిన వ్యక్తి కేనిషా అంటూ తెలిపారు.. నా ఇంటి నుంచి నేను ఏమీ లేకుండా బయటికి వచ్చినప్పుడు నాకు తోడుగా నిలిచింది కేనీషా .. ఆమె నా జీవితంలోకి రావడం ఒక అందమైన భాగస్వామిగా రావడం నాకు ఆనందంగా ఉంది ..నా జీవితంలో ఎదురైన చట్టపరమైన బాగోద్వేగమరమైన ఆర్థిక సమస్యలలో కూడా నాకు తోడుగా నిలిచింది అంటూ ప్రకటనలో తెలియజేశారు.
అంతేకాకుండ నా కథ విన్న తర్వాత తాను మానసికంగా తనకు ఒక సలహాదారునిగా ఉండడమే కాకుండా స్నేహితురాలుగా అన్ని విధాల తనకి సహాయం చేసిందంటూ జయం రవి ప్రకటనలో పేర్కొన్నారు.. మొత్తానికి ఎట్టకేలకు ఈ విషయం పైన జయం రవి ఇలా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి అఫీషియల్ గా విడాకులు రాకుండానే కెనీషా నా భార్య అంటూ ఇన్ డైరెక్ట్ గానే చెప్పేశారు జయం రవి.మరి ఈ విషయం విన్న ఆర్తి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.