టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటులలో సూపర్ స్టార్ కృష్ణ , మెగాస్టార్ చిరంజీవి ముందు వరసలో ఉంటారు. వీరిద్దరు కూడా ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తమకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ వల్ల మెగాస్టార్ చిరంజీవి కి ఓ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిందట. అది ఎలా అనుకుంటున్నారా ..? ఆ వివరాలను తెలుసుకుందాం.

చాలా సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో చిరంజీవి కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇకపోతే కోదండరామిరెడ్డి మొదట ఖైదీ మూవీ లో హీరో గా చిరంజీవి ని అనుకోలేదట. మొదట సూపర్ స్టార్ కృష్ణ ను ఈ మూవీ లో హీరో గా అనుకున్నాడట. అందులో భాగంగా కోదండరామిరెడ్డి , కృష్ణ ను కలిసి ఖైదీ మూవీ కథ మొత్తాన్ని వివరించాడట. కథ మొత్తం విన్న తర్వాత కృష్ణ కు ఆ మూవీ కథ పెద్దగా నచ్చలేదట.

దానితో ఆ మూవీ కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత కోదండరామిరెడ్డి అదే మూవీ కథను చిరంజీవి కి వినిపించగా , ఆయనకు ఆ స్టోరీ సూపర్ గా నచ్చడంతో వెంటనే ఆ మూవీ లో హీరో గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దానితో ఆ కథను ఖైదీ అనే టైటిల్ తో రూపొందించగా ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకోవడం జరిగిందట. ఇలా కృష్ణ వదిలేసిన కథలో చిరంజీవి హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: