
అయితే ఇప్పుడు ఆ అప్డేట్ ఏంటనేది ఇప్పటివరకు బయటకు రాలేదు .. దీంతో ఆ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పుడు ఓ కింత డిసప్పాయింట్ లో ఉన్నారు .. ఇక గత కొంతకాలం నుంచి టీజర్ మరియు రిలీజ్ డేట్ కోసం కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు .. మరి వాటన్నిటిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో కూడా చూడాలి .. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ పై రకరకాల వార్తలు వస్తుండగా .. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మారుతి ఈ సినిమాను 2025 చివర్లో అనగా డిసెంబర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ..
అలాగే ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ విఎఫ్ ఎక్స్ పనులు ఇంకా పెండింగ్లో ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వటంలో కాస్త ఆలస్యం అవుతుందని కూడా అంటున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు మొదట్లో అంచనాలు పెట్టుకోకపోయినా తర్వాత ఫస్ట్ లుక్ గ్లింప్స్ లతో సినిమా పై మారుతి అంచనాలు పెంచేశాడు .. ఇక మరి ఇప్పుడు ప్రభాస్ ది రాజా సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి అంచనాలు అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే..