సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా గెస్ట్ లాంటివాళ్లే. అలా వచ్చి ఇలా టైం ఉన్నంతవరకు ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఫేడ్ అయిపోవాల్సిందే . ప్రతి ఒక్క స్టార్ కూడా ఫేడ్ అవుట్ అయ్యి ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలి.. అందులో సందేహమే లేదు . అయితే హీరోల త్వరగా ఫేడ్ అవుట్ అవుతారా ..? హీరోయిన్లు  త్వరగా ఫేడ్ అవుట్ అవుతారా..? అంటే మాత్రం హీరోలు హీరోయిన్లనే అంటారు జనాలు . హీరోయిన్స్ అది తక్కువ కాలం మాత్రమే ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదగగలరని .. పెళ్లి చేసుకొని పిల్లలను కన్న తర్వాత ఆ హీరోయిన్స్ ఆంటీలుగా మారిపోతారు అని ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్స్ గా నటించిన వాళ్ళు ఆంటీలుగా మారి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలానే ఉన్నారు అంటూ జనాలు ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటారు .


కాగా ఇప్పుడు అలాంటి  ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది . అన్షు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మన్మధుడు సినిమాలో హీరోయిన్ నాగార్జున పక్కన ఎంత క్యూట్ గా నటించి మెప్పించింది అనేది అందరికీ తెలుసు . అదే అన్షు . రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ కి లవర్ గా నటించింది . కాగా ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది.  రీసెంట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మజాకా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . మజాకా సినిమాతో అద్దిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో మళ్ళీ  స్థానాన్ని రీప్లే చేసుకుంది.



 కాగా ఇప్పుడు ఇదే బ్యూటీ ప్రభాస్ కి అక్కగా నటించబోతుంది అన్న వార్త రెబల్ ఫ్యాన్స్ గార్ట్స్ బ్రేక్ చేసేలా చేసింది . సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో "స్పిరిట్" మూవీలో నటిస్తున్నాడు ప్రభాస్ . ఈ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మరి ఏ సినిమాపై కూడా లేవనే చెప్పాలి . అర్జున్ రెడ్డి..యానిమల్ సినిమా చూసిన తర్వాత సందీప్ రెడ్డి రేంజ్ బాగా పెరిగిపోయింది.  ఈ సినిమాలో బోల్డ్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో చూపిస్తాడు అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు . అది కూడా ప్రభాస్ లాంటి సిగ్గుపడే హీరోతో బోల్డ్ పెర్ఫార్మెన్స్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.



కాగా ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనె సెలెక్ట్ అయిందని .. ఈ సినిమా కోసం 20 కోట్లు ఛార్జ్ చేసింది అని .. ఒక బిగ్ రూమర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇదే మూమెంట్లో ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ గా తెరకెక్కుతుంది అని సిస్టర్ క్యారెక్టర్ కోసం అన్షు ని సెలెక్ట్ చేసుకున్నారు అని.. దీనికి సంబంధించి అగ్రిమెంట్ పేపర్లపై కూడా అన్షు సైన్ చేసేసింది అంటూ బాలీవుడ్ మీడియాలో బాగా ఓ న్యూస్ ట్రెండ్ ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు లవర్స్ ప్రభాస్ - అన్షు ను చూసిన రెబల్ ఫ్యాన్స్ ఇప్పుడు అదే అన్షు ను .. ప్రభాస్ కి అక్క క్యారెక్టర్ లో చూస్తే ఏమైపోతారో అంటూ కొంతమంది ఘాట్ కౌంటర్స్ కూడా వేస్తున్నారు. అయితే కేవలం ప్రభాస్ - అన్షు మాత్రమే కాదు గతంలో చాలామంది కూడా ఇలా ఒకప్పుడు హీరో హీరోయిన్లుగా ఆ తర్వాత అక్క తమ్ముళ్లుగా నటించారు . మరొకసారి అదేవిధంగా ఇండస్ట్రీలో జరగబోతుంది.  చూద్దాం మరి సందీప్ రెడ్డి  ఈ విషయంలో ఎంత సక్సెస్ అవుతాడో..???

మరింత సమాచారం తెలుసుకోండి: