టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో చాలా సినిమాలను రిజెక్ట్ చేశాడు. అలా చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇలా చిరంజీవి తన కెరీర్లో రిజెక్ట్ చేసిన మూవీలలో రెండు మూవీలలో మోహన్ బాబు హీరోగా నటించగా ఆ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. మరి చిరంజీవి రిజెక్ట్ చేసిన ఆ రెండు మూవీలు ఏవి ..? ఏ మూవీల ద్వారా మోహన్ బాబుకు అద్భుతమైన విజయాలు బాక్సా ఫీస్ దగ్గర దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ బాబు "అల్లుడు గారు" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మొదట రాఘవేంద్రరావు , చిరంజీవిని హీరోగా తీసుకోవాలి అని అనుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో రాఘవేంద్రరావు , చిరంజీవి కాకుండా ఈ సినిమాలో మోహన్ బాబును హీరోగా ఎంపిక చేసుకున్నాడట. మోహన్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం అసెంబ్లీ రౌడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి బి గోపాల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో గోపాల్ మొదటగా చిరంజీవి ని హీరో గా తీసుకోవాలి అని అనుకున్నాడట. కానీ చివరగా గోపాల్ ఈ మూవీ లో మోహన్ బాబు ను హీరో గా ఎంచుకున్నాడట. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా అల్లుడు గారు , అసెంబ్లీ రౌడీ సినిమాలలో మొదట చిరంజీవి ని హీరో గా అనుకున్నా చివరగా మాత్రం మోహన్ బాబు ను హీరో గా తీసుకోగా ఈ రెండు మూవీల ద్వారా కూడా మోహన్ బాబుకు అద్భుతమైన విజయాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: