ఏంటి అల్లు అర్జున్ తో నిహారిక కి లవ్ స్టోరీ నా.. ఎంత బావ అయితే మాత్రం పెళ్లైన వాడితో లవ్ స్టోరీ ఏంటి అనుకుంటారు ఈ విషయం తెలియని చాలామంది.అంతే కాదు దీనికి స్నేహ రెడ్డి ఒప్పుకుంటుందా అని కూడా కామెంట్స్ పెడతారు. కానీ అసలు విషయం వేరే ఉంది.అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ అంటే అందరూ ఆయనతో నిహారిక ప్రేమ లో పడింది కావచ్చు అనుకుంటారు. కానీ అలా అనుకుంటే తప్పులో కాలిసినట్టే. ఎందుకంటే నిహారిక ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తోంది.ఇందులో భాగంగా మీకు అవకాశం వస్తే ఎవరితో ఎలాంటి సినిమాలు చేస్తారు అని ప్రశ్న ఎదురవగా బన్నీతో లవ్ స్టోరీ అని చెప్పింది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే..కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ని నిహారిక నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో తాజాగా ఈ సినిమా కి నిర్మాతగా చేసిన నిహారిక కి  వర్సటైల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ని అందుకుంది.ఇందులో భాగంగా యాంకర్ మీకు అవకాశం వస్తే టాలీవుడ్ హీరోలలో ఎవరితో ఎలాంటి సినిమాలు తీస్తారని అడిగింది.

 దానికి నిహారిక సమాధానం ఇస్తూ.. మహేష్ బాబు తో మైథాలజికల్, అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ తీస్తా.. ఎందుకంటే రీసెంట్గా అల్లు అర్జున్ యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. అందుకే లవ్ స్టోరీ తీస్తా..అలాగే బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ కామెడీ చాలా బాగుంది.అందుకే ఆయనతో కామెడీ జానర్ లో ఓ సినిమా చేస్తా..కానీ దర్శకురాలిగా చేస్తే మాత్రం మొట్టమొదటి సినిమా నా అన్న రామ్ చరణ్ తోనే చేస్తాను అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.ప్రస్తుతం నిహారిక మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: