స్టార్ హీరోలు ప్లాప్‌లు ఇస్తుంటే సోషల్ మీడియాలో మిగిలిన హీరోల అభిమానుల ముందు భారీగా ట్రోల్ అవటం మామూలు విషయం కాదు .  ఒకవైపు ఫ్లాప్‌ ఇచ్చినా .. తమకి ఇష్టమైన హీరోని వదులుకోలేం .. అవతలి వాళ్లకు కామెంట్స్ ని భరించలేం .. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు అనే విధంగా  మాట్లాడుతున్నాడు ప్రజెంట్ ఆ నలుగురు హీరోల అభిమానులు .. ఇంతకీ వారు ఎవరంటే.. రిట్రో విజయత్ర ఇప్పుడే మొదలైంది అందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ .. కానీ ఈ సినిమా అనుకున్నంత ఎక్కడ ఎక్కలేదు భయ్యా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి ..


ఎవరికి ఎక్కని ప్రయోగాలు ఏంటి .. ఆ స్క్రిప్ట్ సెలక్షన్ ఏంటి .. పక్క కమర్షియల్ సినిమా చేయవచ్చు కదా అని సూర్యకి సలహాలు ఇచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది .. అలాగే ఆయనకే కాదు మరో హీరో విక్రమ్ కి కూడా ఇలాంటి సలహాలు ఎక్కువగా వస్తున్నాయి .  వీరధీరశూరన్‌ పార్ట్ 2  బాగానే ఉందనే మాట కోలీవుడ్ లో వినిపించిన .. మనవాళ్ళు మాత్రం అబ్బే అసలు ఏమీ లేదు అనే విధంగా పెదవి విరిచారు .. అంతకు ముందు వచ్చిన తంగలాన్‌  మాత్రమే కాదు .. అంతకుముందు సినిమాలు కూడా పెద్దగా ఎక్కలేదు .. కోలీవుడ్ లో విక్రమ్ కి మన రవితేజ కి కంపేర్ చేస్తున్నారు చాలామంది .


ప్రజెంట్ రవితేజ నుంచి వస్తున్న మాస్ జాతర కంపల్సరిగా హీట్ అవ్వాల్సిందే .. మాస్ మహారాజా కెరియర్ ఊపందుకున్న టైంలో మళ్లీ గట్టిగా బొక్క బార్ల పడినట్టు అవుతుంది .  వ‌రుస ప్లాప్ ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అందుకే ఇప్పుడు ఆయన హోప్స్ అన్ని మాస్ జాతర మీదే ఉన్నాయి . అలాగే సీనియర్ హీరో నాగార్జున కూడా సోలుగా సినిమా చేసి హిట్‌కోట్టి చాలా కాలమైంది .  ఇప్పుడు రజనీకాంత్ తో చేస్తున్న కూలీ ధనుష్ తో చేస్తున్న కుబేర మీద భారీ ఆశలు పెట్టుకున్నారు .. తమ హీరో మంచి హిట్ ఇస్తే చాలు కాలర్ ఎగరేసుకుంటామని ఎదురుచూస్తున్నారు అక్కినేని అభిమానులు ..

మరింత సమాచారం తెలుసుకోండి: