
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో రాబోతున్న ఎన్సి 24 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ భారీ సినిమాను రూపొందిస్తున్నారు .. ఇక ఈ సినిమా ని కూడా ఓ మిస్టేక్ థ్రిల్లర్ గా చిత్ర యూనిట్ తీసుకు రాబోతుంది .. అయితే ప్రేక్షకలు ఎప్పుడూ చూడని ఆశ్చర్యానికి గురి చేసే అడ్వెంచర్స్ ఈ సినిమా లో ఉండబోతున్నట్టు సినిమా ఇప్పటికే ఓ గ్లింప్ ద్వారా చెప్పేసింది .. అయితే ఈ సినిమా కోసం ఓ భారీ గుహ సెట్‌ను వేశారు సినిమా యూనిట్ .. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఈ భారీ సెట్ ను ఏర్పాటు చేయగా .. ఇందులో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు .. అలాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఈ గుహసెట్లోనే తెరకెక్కించబోతున్నారు .
అయితే ఈ గుహ సెట్‌ను ప్రముఖ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల డిజైన్ చేయగా .. ఇక ఈ సెట్ కోసం ఏకంగా 10 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది .. అలాగే ఈ సినిమా లో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది . అలాగే అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు .. ఇక ఈ సినిమా ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి . తండెల్ సినిమా తో భారీ సక్సెస్ అందుకున్న నాగచైతన్య .. ఇప్పుడు తన 24వ సినిమా తో కూడా మరో బ్లాక్ బస్టర్ పై కనేసాడు .. ఇప్పటికే విరూపాక్ష తొ తానేంటో చూపించిన కార్తీక్ దండు . ఇప్పుడు నాగచైతన్య తో చేయబోయే సినిమా తో కూడా మరో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నాడు .. ఇంక మరి ఈ సినిమా తో ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి ..