
హీరో వెంకటేష్ ,శివ కార్తికేయన్ వంటి హీరోలతో సినిమా చేయబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు తాజాగా మెగా హీరో రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అన్నట్లుగా తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జల్సా, అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది వంటి చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు బెస్ట్ ఫ్రెండ్ కావడమే కాకుండా పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలకు రచయితగా కూడా వ్యవహరించారు.
పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథను కూడా త్రివిక్రమ్ సిద్ధం చేశారట. ప్రస్తుతం ఉన్న పొలిటికల్స్ వల్ల చేయలేకపోతున్నారని అందుకే ఈ కథను రామ్ చరణ్ తో తీయమని సూచించారట పవన్ కళ్యాణ్. దీంతో అటు రామ్ చరణ్ తో త్రివిక్రమ్ కథకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారకంగా కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నది. ఈ విషయం విన్న అభిమానులు కూడా త్రివిక్రమ్, రామ్ చరణ్ కాంబినేషన్లో మూవీ వస్తే కచ్చితంగా మెసేజ్ సినిమానే అయ్యి ఉంటుందని నమ్ముతున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబుతో పెద్ది సినిమాలో నటిస్తున్నారు రామ్ చరణ్. మరి ఈ సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ తో చేస్తారమో చూడాలి.