ఎన్నో రోజుల నుండి వేచి చూస్తున్న విశాల్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ రానే వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్ తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ ని చెప్పేశారు.మరి ఇంతకీ  విశాల్ ప్రేమించిన అమ్మాయి ఎవరు..ఆయన పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం.విశాల్ పెళ్లి ఇప్పటికే రెండు మూడు సార్లు ఆగిపోయింది. ఎంగేజ్మెంట్ జరిగాక కూడా ఈయన పెళ్లి ఆగిపోయిన సందర్భం ఉంది. ఇక ప్రస్తుతం ఆయన్ని పెళ్లి గురించి అడిగితే నడిగర్ సంఘ భవనం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అని చెబుతున్నారు. అయితే తాజాగా విశాల్ తన పెళ్లికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. మీ పెళ్లి ఎప్పుడు అని యాంకర్ అడగగా విశాల్ మాట్లాడుతూ.. నేను నటీనటుల భవనం అయినటువంటి నడిగర్ సంఘ భవనం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటాను.

ఈ భవనం మరో రెండు నెలల్లో పూర్తయిపోతుంది. ఆగస్టు 15న ఈ నడిగర్ సంఘ భవనాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నాము. అన్ని కుదిరితే ఆగస్టు 15 కి నడిగర్ సంఘ భవనాన్ని ప్రారంభిస్తాము. అలాగే ఆగస్టు 29 నా బర్త్ డే కావడంతో ఆరోజు నేను ప్రేమించిన అమ్మాయికి సంబంధించి అలాగే నా పెళ్లికి సంబంధించి గుడ్ న్యూస్ ప్రకటిస్తాను.గత కొద్దిరోజుల నుండి నేను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాను. నా ప్రేయసి గురించి మరికొద్ది రోజుల్లోనే మీకు తెలియజేస్తాను.నాది లవ్ మ్యారేజ్.. మరికొద్ది రోజుల్లో నా లవర్ ఎవరో మీకు చెబుతాను అంటూ విశాల్ తన పెళ్లికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు.

ఇక విశాల్ పెళ్లి సెప్టెంబర్ లో జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇక విశాల్ తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పడంతో చాలామంది విశాల్ మనసు దోచిన ఆ అమ్మాయి ఎవరో అని వెతికే పనిలో పడ్డారు. ఇక ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన విశాల్ చెల్లమే అనే సినిమాతో హీరోగా మారారు.ఆ తర్వాత ఈయన ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తమిళ స్టార్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన పర్సనల్ లైఫ్ గురించి చూస్తే.. ఈ మధ్యకాలంలో ఆయన తరచూ ఆసుపత్రి పాలవుతున్నారు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగానే స్టేజ్ పై కళ్ళు తిరిగి పడిపోయాడు.అలా ఆయన కొన్ని హెల్తీ ఇష్యూస్ తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: