నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి విజయాలను అందుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం పాటు బాలకృష్ణ వరుస అపజయాలను ఎదుర్కొంటూ వచ్చాడు. ఆ సమయంలో బాలయ్య అభిమానులు చాలా నిరుత్సాహ పడ్డారు. అలా బాలయ్య వరుస అపజయాలను అందుకొంటూ వచ్చిన సమయం లోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మూవీ తర్వాత బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. అలా వరుస పెట్టి మూడు విజయాలు అందుకున్న బాలయ్య ఆ తర్వాత బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు కూడా దక్కాయి. కానీ ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉండడంతో ఈ మూవీ కి పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

దానితో ఈ మూవీ భారీ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ మూవీ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి అత్యంత దగ్గరగా వచ్చింది కానీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోలేకపోయినట్టు తెలుస్తుంది. కేవలం ఒకే ఒక్క శాతం కలెక్షన్లను వసూలు చేయలేక ఈ మూవీ హిట్ స్టేటస్ను అందుకోలేకపోయినట్లు తెలుస్తుంది. ఇలా హిట్ స్టేటస్ కి అత్యంత దగ్గరగా వచ్చి ఈ మూవీ హిట్ స్టేటస్ ను అందుకోలేదు అని వార్తలు వస్తూ ఉండడంతో బాలయ్య అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: