సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో ఒక దర్శకుడి కాంబోలో వచ్చిన ఓ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది అంటే మరో సారి ఆ కాంబోలో సినిమా వస్తే బాగుంటుంది అని ఆ హీరో అభిమానులు , మామూలు ప్రేక్షకులు కూడా భావిస్తూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. మహేష్ బాబు తనకు ఒక విజయం ఇచ్చిన దర్శకులతో మరో సినిమా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ అలా మహేష్ నమ్మి ఓ దర్శకుడికి రెండవ అవకాశం ఇచ్చిన సందర్భంలో ఎక్కువ సార్లు ఆయన నమ్మకం వృధా అయిన సందర్భాలే ఉన్నాయి. అలా మహేష్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయిన ఆ దర్శకులు ఎవరో తెలుసుకుందాం.

మహేష్ కొన్ని సంవత్సరాల క్రితం గుణశేఖర్ దర్శకత్వంలో ఒక్కడు అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహేష్ , గుణశేఖర్ దర్శకత్వంలో అర్జున్ , సైనికుడు అనే సినిమాల్లో నటించాడు. ఈ రెండు సినిమాలు కూడా ఒక్కడు రేంజ్ విజయాలను మాత్రం అందుకోలేకపోయాయి. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ హీరోగా నటించాడు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ , శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మహేష్ హీరోగా శ్రీను వైట్ల ఆగడు అనే మూవీని రూపొందించాడు. ఈ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. ఇలా ఈ ముగ్గురు దర్శకులు కూడా మహేష్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: