
దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషిగా అవుతున్న సందర్భంలో తాజాగా ఎన్టీఆర్ అభిమానులకు నిరాశపరిచేలా మైత్రి మూవీస్ మేకర్స్ వారు ఒక ప్రకటన తెలియజేశారు. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఇలాంటి అప్డేట్ ఇవ్వలేదని తెలియజేసింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా ట్విట్టర్ ద్వారా తెలిపారు.. డియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. నీల్ సినిమా గ్లింప్స్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలుసు కానీ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 సినిమా నుంచి ఎవరు ఊహించని అప్డేట్ రాబోతోంది అంటూ తెలిపారు.
ఈ కారణంగానే ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ ని వాయిదా వేస్తున్నామంటూ అధికారికంగా తెలియజేసింది చిత్ర బృందం. దీంతో అభిమానులు కొంతమేరకు డిసప్పాయింట్ అవుతూ ఉండగా కానీ వార్ 2 సినిమా గురించి అప్డేట్ వస్తోందని తెలిసి కొంతమేరకు ఆనంద పడుతున్నారు. ఎందుకంటే మొదటిసారి ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటిస్తూ ఉండడంతో పాటు ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారట. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా అఫీషియల్ గా తెలుపలేదు. హృతిక్ రోషన్ మాత్రం అప్పుడప్పుడు ట్విట్టర్లో స్పందిస్తూ ఉంటారు. మరి ఎన్టీఆర్ ఎలా ఉంటారని ఎక్సయిటింగ్ గా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.