
నాగచైతన్య తన నెక్స్ట్ సినిమాను విరుపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏది రిలీజ్ అయిన ఓ రేంజ్ లో ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బివిఎస్ఎన్ ప్రసాద్ , సుకుమార్ లు నిర్మిస్తున్నారు. నాగచైతన్య కెరియర్ లోనే ఇది తొలి పాన్ ఇండియా సినిమా కూడా కావడం గమనార్హం . అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా పూజ హెగ్డే ని అనుకున్నారట . కానీ పూజ హెగ్డే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకుంటున్న కారణంగా నాగచైతన్య కెరియర్ ఇక డౌన్ అవ్వకూడదు అంటూ నాగార్జున డెసిషన్ తీసుకొని పూజ హెగ్డే ని ఈ సినిమా నుంచి తప్పించారట .
నేషనల్ క్రష్ రష్మిక అయితే ఈ పాన్ ఇండియా సినిమాకి బాగుంటుంది అంటూ రష్మిక నీ ప్రోచ్ అవ్వగా ఆమె రిజెక్ట్ చేసిందట . ఫైనల్లీ రీసెంట్ గానే హిట్ కొట్టిన మీనాక్షి చౌదరిని ఈ సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారట మేకర్స్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరి వెంకటేష్ సరసన గర్ల్ ఫ్రెండ్ గా కనిపించింది . మీను మీను మీను అంటూ ఈ సినిమా చూసిన తర్వాత అందరూ ఆమెను అలాగే పలకరించేవాళ్ళు . వెంకటేష్ లవర్ అంటూనే చాలా మంది ఆమెను ఆటపట్టిస్తూ ఉంటారు .
అయితే ఇప్పుడు వెంకటేష్ లవర్ తో నాగచైతన్య ఈ సినిమాలో రొమాన్స్ చేయబోతున్నాడు అని తెలిసి జనాలు ట్రోల్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే వావి వరసలు ఏవి ఉండవు అంటూ కొంతమంది దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు నిజ జీవితంలో ఆమె లవర్ కాదుగా ..కేవలం సినిమా కోసమే అలా..అలా అనుకుంటే గతంలో ఎంతో మంది ఇలాగే హీరోయిన్స్ ను మార్చుకున్నారు. చిరంజీవి - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్తో ఒకే హీరోయిన్స్ కలిసి నటించలేదా..? అప్పుడు లేని తప్పు ఇప్పుడొచ్చిందా అంటూ నాగచైతన్య ని సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాపై ఎంత పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయో అంతే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఒక భారీ గృహ సెట్ ను కూడా తీర్చిదిద్దారు మేకర్స్ . ఈ గుహలోనే దాదాపు 28 రోజుల పాటు చిత్రీకరణ జరగబోతుందట..!