
అందుతున్న సమాచారం ప్రకారం కేవలం ఆరు నెలలు అంటే ఆరు నెలల్లోనే ఈ సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసేయాలి అన్న ప్లాన్ లో ఉన్నారట త్రివిక్రమ్ . త్రివిక్రమ్ ఏదైనా సరే చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు . అందుకే త్రివిక్రమ్ మీద అంత కాన్ఫిడెన్స్ జనాలకి . కాగా త్రివిక్రమ్ వెంకటేష్ కాంబోలో మూవీ అంటే కచ్చితంగా అందరికీ మొదట గుర్తొచ్చేది నువ్వు నాకు నచ్చావ్ ..ఆ తర్వాత గుర్తొచ్చేది మల్లీశ్వరి . ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా జనాలని ఎంటర్టైన్ చేశాయో ఎప్పటికీ మర్చిపోలేం . కాగా వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుంది అని తెలియగానే అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరై ఉంటారు...? త్రివిక్రమ్ తన సినిమాలో హీరోయిన్స్ విషయంలో చాలా కేర్ఫుల్ గా స్టెప్ తీసుకుంటారు.. అయితే ఇప్పుడు వెంకటేష్ పక్కన ఏ హీరోయిన్ ని చూపించబోతున్నాడు ..?
ఆల్రెడీ ఐశ్వర్యరాజేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మెరిసింది. ఇక మరొకసారి చూపిస్తే బాగోదు త్రివిక్రమ్ కి ఎంతో ఇష్టమైన మీనాక్షి చౌదరి కూడా సంక్రాంతికి వస్తున్నాం మూవీలో ఆల్రెడీ వెంకటేష్ పక్కన నటించేసింది. ఇక వెంకటేష్ పక్కన ఏ హీరోయిన్ సెట్ అవుతుంది.. సూట్ అవుతుంది. త్రివిక్రమ్ ఎలా ప్లాన్ చేశాడు..? అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. కొంతమంది అంజలి అని ..మరి కొంతమంది అతిథి రావు హైదరి అని మరి కొంతమంది నయనతార అని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ జనాలు మాట్లాడుకునే మాటలు నిజం చేయకుండా కొత్త కాంబో ని సెట్ చేశాడు త్రివిక్రమ్ .
వెంకటేష్ పక్కన హీరోయిన్గా స్టార్ బ్యూటీ సంయుక్త మీనన్ ని చూస్ చేసుకున్నారు . సంయుక్తా మీనన్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మధ్య బాండింగ్ అందరికీ తెలిసిందే . వీళ్ళ గురించి ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు . ఇలాంటి మూమెంట్లోనే త్రివిక్రమ్ ఎవరు ఊహించిన విధంగా వెంకటేష్ సరసన సంయుక్తను చూస్ చేసుకోవడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అఫ్కోర్స్ వీళ్లిద్దరు కాంబో కూడా బాగానే ఉంటుంది అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా సంయుక్త మీనన్ తన కథల విషయంలో చాలా పర్ఫెక్ట్ గా నిర్ణయం తీసుకుంటుంది అని .. ఎంత పెద్ద బడా హీరో అయినా సరే తన క్యారెక్టర్ కి వాల్యూ ఉంటేనే ఆ సినిమాలో నటిస్తుంది అని ఇప్పుడు వెంకటేష్ సినిమాను ఓకే చేసింది కచ్చితంగా ఈ సినిమా ఒక "కలిసుందాం రా" ఒక "జయం మనదేరా" లాంటి మూవీ కాన్సెప్ట్ అయి ఉంటుంది అని .. నో డౌట్ ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం పక్క అంటూ ఫాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు . కొంతమంది సంయుక్త మీనన్ అందాన్ని ఓ రేంజ్ లో ఘాటుగా పొగిడేస్తూ కూడా కామెంట్స్ పెడుతున్నారు . సోషల్ మీడియాలో త్రివిక్రమ్ - సంయుక్తా మీనన్ - వెంకటేష్ ల పేర్లు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!