"హైపర్ ఆది".. గురించి అందరికీ తెలిసిందే.  ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనేలేదు.  తన టాలెంట్ తో కష్టపడి పైకి ఎదిగి  జబర్దస్త్ షో ద్వారా కమెడియన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు . కాగా  హైపర్ ఆది పలు ఈవెంట్స్ లో కామెడీ స్కిట్స్ చేస్తూ అందరిని నవ్వించేవాడు . ఇదే జనాలకి తెలుసు.  హైపర్ ఆది లో మరో టాలెంట్ కూడా దాగుందన్న  విషయం బయటపడింది.  హైపర్ ఆదికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.


 హైపర్ ఆది మంచిగా పాటలు పాడుతాడు . ఫీల్ అవుతూ పాటలు పాడుతాడు.  దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . హైపర్ ఆది తాజాగా కారులో పాట పాడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . "ఆది ఒక కారులో  ప్రయాణిస్తూ ఉండగా నా ఆటోగ్రాఫ్ లోని పాట ప్లే అయింది. వెంటనే ఆ పాటను అందుకొని ఆలపించేసాడు హైపర్ ఆది . ఈ పాట పాడడం చాలా చాలా టఫ్ .. ఫీల్ తో పాడాలి . నా ఆటోగ్రాఫ్ లోని నువ్వంటే ప్రాణం అనే సాంగ్ ఎంత ఎమోషనల్ సాంగ్ అనేది అందరికీ తెలుసు ".



అయితే రియల్ సింగర్ కి ఏమాత్రం తీసిపోని విధంగా హైపర్ ఆది ..తనదైన గాత్రంతో ఈ పాటను ఆలపించారు . అంతేకాదు "గొప్పగా ఈ పాట రాసారయ్య..యేసుదాస్ వాళ్ళ అబ్బాయి విజయ్ యేసుదాస్ అద్భుతంగా పాడాడు" అంటూ హైపర్ ఆది వీడియోలో చెప్పడం జనాలను ఆకట్టుకుంది . అయితే కొంతమంది ఈ వీడియో చూసి "నీ వాయిస్ చాలా బాగుంది బ్రో సింగర్ గా ట్రై చెయ్" అంటుంటే మరికొందరు "నువ్వు లవ్ ఫెయిల్యూరా..? అందుకే ఈ పాట నీకు అంతగా కనెక్ట్ అయిందా" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  అంతేకాదు హైపర్ ఆది తన మనసులోని బాధను ఒక పాట రూపంలో బయటపెట్టేసాడు అంటూ మరి కొంతమందిని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో హైపర్ ఆదికి సంబంధించిన ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది..!



మరింత సమాచారం తెలుసుకోండి: