- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో అత‌డో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఇటీవ‌ల కాలంలో మంచి ఆల్బ‌మ్ లే ఇస్తున్నాడు. ఆ పాటలు ఆ సినిమాలకు ప్లస్ అవుతున్నాయి. మంచి మ్యూజికల్ హిట్లు పడ్డాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ రాను రాను అతడు చాలా బాగా ఓవర్ చేస్తున్నాడు అన్న గుసగుసలు టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి. తాజాగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ లో ఓ నిర్మాతకు కోట్ చేసిన ఫిగర్ విని షాక్ కొట్టినంత పని అయిందట. ఓ మంచి కాంబినేషన్ సినిమాకు సంగీతం అందించమని అడిగారట. తప్పకుండా అని చెప్పి రెమ్యునరేషన్ జస్ట్ 9 కోట్లు చెప్పాడట. దీంతో షాక్ అవ్వటం నిర్మాత వంతు అయిందట. ఫుల్ బిజీగా ఉండే తమన్ ఇంకా అంత కోట్ చేయడం లేదు. రెహ్మ‌న్ లాంటోడే ఎనిమిది కోట్ల వరకు తీసుకుంటున్నాడు.


అనిరుద్ 12 నుంచి 15 కోట్లు మధ్యలో ఉన్నాడు. అలాంటిది ఈ అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తొమ్మిది కోట్లు అంటే షాక్ కాక ఏమంటుంది ? ఎంత నాలుగు ఐదు మ్యూజిక్ హిట్లు చేతిలో ఉన్న ఆడియో రైట్స్ బ్రహ్మాండంగా లాగిసేంత‌ పేరు అయితే ఇంకా రాలేదు. నాని - అనిరుధ్ - దసరా డైరెక్టర్ లాంటి కాంబినేషన్ ఉంటేనే 18 కోట్లు ఆడియో రైట్స్ లాగటం కష్టమైంది. అలాంటిది ఈ అప్ కమింగ్ డైరెక్టర్కు తొమ్మిది కోట్లు ఇచ్చి ఏం సాధించాలి ? ఇతగాడు వైఖరితో ఇప్పటికే చాలామంది మెల్ల మెల్లగా దూరం అవుతున్నారు. ఇలాగే ముందుకు వెళితే అతడికి అవకాశాలు రావు .. సరి కదా అతడు వైఖరికి చాలామంది దూరం అవుతారు అన్న గుసగుసలు టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: