టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన చిన్న వయసులోనే నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకుని నటుడిగా తనకంటూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే గొప్ప నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న తారక్ వ్యక్తిత్వంలో కూడా అంతే గొప్పవాడు అని చాలా సందర్భాలలో అనిపించుకున్నాడు. అందుకు ఉదాహరణగా ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా భాస్కర్ "బొమ్మరిల్లు" అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుందు. భాస్కర్ మొదట ఈ మూవీ లో సిద్ధార్థ్ ను కాకుండా తారక్ ను హీరో గా తీసుకోవాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనను కలిసి కథ మొత్తాన్ని వివరించాడట. కథ మొత్తం విన్నాక తారక్ ... స్టోరీ సూపర్ గా ఉంది. ఈ కథలో బ్లాక్ బాస్టర్ అయ్యే అంశాలు అనేకం ఉన్నాయి. కానీ ఇది నాతో తీస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అవుద్ది అని చెప్పాడట.

అందుకు ప్రధాన కారణం ... నా సినిమాలకు వచ్చే జనాలు భారీ యాక్షన్ సన్నివేశాలు , పెద్ద పెద్ద డైలాగులు ఎక్స్పెక్ట్ చేసి వస్తారు.అవి ఈ కథలో లేవు. నన్ను పెట్టి ఈ సినిమా తీస్తే ఈ సినిమాకు అది మైనస్ అయ్యే అవకాశం ఉంది. నువ్వు ఏదైనా క్లాస్ ఇమేజ్ ఉన్న హీరోతో ఈ సినిమా చేయి ... అద్భుతమైన విజయం అందుకుంటుంది అని చెప్పాడట. భాస్కర్ అలా చేయగా ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా తారక్ కథ నచ్చిన కూడా తనపై తీస్తే వర్కౌట్ కాదు అని చెప్పి మరి ఆ మూవీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: