ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా రీ రిలీజ్ అవుతున్న సినిమాలలో కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన అనేక సినిమాలకు రీ రిలీజ్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రీ రిలీజ్ అయిన సినిమాలలో టాప్ సిక్స్ లో ఉన్న సినిమాలలో ఏకంగా మహేష్ బాబు నటించిన మూడు సినిమాలు ఉన్నాయి. మరి టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన సినిమాలలో రీ రిలీజ్ లో భాగంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 మూవీస్ ఏవి ..? అందులో మహేష్ బాబు నటించిన సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన మురారి మూవీ రీ రిలీజ్ లో భాగంగా 8.90 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాలీవుడ్ మూవీలలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ సినిమా 8.01 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , పవన్ హీరోగా రూపొందిన ఖుషి మూవీ 7.46 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. ఇక మహేష్ బాబు , విక్టరీ వెంకటేష్ హీరోలుగా రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా 6.60 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా , మహేష్ హీరోగా రూపొందిన బిజినెస్ మాన్ సినిమా 5.85 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mb