టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ తన కెరియర్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎంతో మంది హీరోయిన్లతో ఆడి , పాడాడు. కానీ పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో ఎక్కువ శాతం హీరోయిన్లను రిపీట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ తన కెరియర్లో రిపీట్ చేసిన హీరోయిన్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు రేణు దేశాయ్ , మరొకరు శృతి హాసన్. పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబోలో చాలా సినిమాలే వచ్చాయి. ఇకపోతే వీరి కాంబోలో వచ్చిన సినిమాలలో ఓ చిన్న కామన్ పాయింట్ ఉంది. అదేమిటో తెలుసా ..? పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబోలో వచ్చిన సినిమాలు ఏవి ..? వారిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబోలో మొదటగా గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హిందీ సినిమా అయినటువంటి దబాంగ్ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో కాటమ రాయుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా తమిళ మూవీ అయినటువంటి వీరం అనే సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబోలో వాకిల్ సాబ్ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ హిందీ సినిమా అయినటువంటి పింక్ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇలా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబోలో గబ్బర్ సింగ్ , కాటమ రాయుడు , వాకిల్ సాబ్ అనే మూడు సినిమాలు రాగా ... ఈ మూడు సినిమాలు కూడా ఏదో ఒక సినిమాకు రీమేక్. లుగా రూపొందాయి. ఇలా పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబోలో వచ్చిన సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఆ అన్ని మూవీలు కూడా రీమేక్ మూవీలు కావడమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pk