
ఈ సినిమా కోసం 100 కోట్లు కూడా తీసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. ఒకానొక మూమెంట్లో ఈ సినిమాలో ఎన్టీఆర్ ది గెస్ట్ పాత్ర అని .. కేవలం ఐదు నిమిషాలు కనిపించి అలా మాయం అవుతాడు అని ..కానీ ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్ర చేయబోతున్నాడు అంటూ టాక్ వినిపించింది . ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే మాత్రం ఎన్టీఆర్ ది నెగిటివ్ షేడ్స్ పాత్ర కాకపోవచ్చు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అలా అని గెస్ట్ పాత్ర కూడా కాదు. లీడ్ క్యారెక్టర్ గానే కనిపిస్తుంది .
హృతిక్ రోషన్ కి ఏ రేంజ్ లో ఇంపార్టెన్స్ ఇచ్చారో సినిమాలో ఎన్టీఆర్ కి కూడా అదే రేంజ్ లో ఇంపార్టెన్స్ ఇస్తూ కొన్ని సీన్స్ హైలెట్ గా రాసుకున్నాడు అయాన్ ముఖర్జీ. హాలీవుడ్ మూవీ ని తలదన్నే రేంజ్ లోనే సినిమాలోని కొన్ని షాట్స్ ఆకట్టుకున్నాయి . దీంతో అభిమానులకి కొత్త డౌట్స్ మొదలయ్యాయి . ఇది మల్టీస్టారర్ మూవీ నా..? ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడా..? విలన్ గా నటిస్తున్నాడా..? టీజర్ చూస్తుంటే మాత్రం హృతిక్ రోషన్ కి సరి సమానంగా ఉండే పాత్రలోనే కనిపించబోతున్నాడు ఎన్టీఆర్ అని అర్థమవుతుంది . ఈ డౌట్స్ క్లియర్ అవ్వాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే . వార్ 2 సినిమాలో మరో సర్ప్రైజ్ ఉంది అని అది థియేటర్లోనే చూడాలి అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీకి మరింత హైప్ ఇస్తున్నారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ..!!