టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి తన కెరీర్లో అశ్వినీ దత్ బ్యానర్లో చాలా సినిమాలలో నటించాడు. చిరంజీవి , అశ్విని దత్ బ్యానర్లో రూపొందిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే అశ్విని దత్ , చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ని కొంత కాలం క్రితం అశ్వినీ దత్ పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేయగా రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వచ్చాయి.

చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి హీరో గా రూపొందిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను కూడా అశ్వినీ దత్ నిర్మించాడు. ఈ మూవీ 1990 సంవత్సరం మే 9 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి ఈ సంవత్సరం మే 9 వ తేదీకి 35 సంవత్సరాలు కంప్లీట్ అయింది. దానితో ఈ సినిమా విడుదల 35 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా కూడా అద్భుతమైన ఇంపాక్ట్ ను బాక్సా ఫీస్ దగ్గర చూపించింది. ఇకపోతే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి హీరోయిన్గా నటించగా ... ఆ సమయంలో స్టార్ దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో ఇళయరాజా అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాలో చిరంజీవి , శ్రీదేవి జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా కూడా మంచి కలెక్షన్లను రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఇంపాక్ట్ ను చూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: