తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ దర్శకులలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా ఎన్నో సంవత్సరాలు కెరీర్ను కొనసాగించాడు. రాఘవేంద్రరావు ఇప్పటికే వందకు పైగా సినిమాలకి దర్శకత్వం వహించాడు. ఈయన కెరియర్లో 100 వ సినిమాగా వచ్చిన గంగోత్రి సినిమాను రూపొందించాడు. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.

ఈ సినిమాతో అల్లు అర్జున్ హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్గా రూపొందిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. అశ్వినీ దత్మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ఆ సమయంలో ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ని రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో సందర్భంగా చిరంజీవి , రాఘవేందర్రావు , ఈ మూవీ నిర్మాత అయినటువంటి అశ్వినీ దత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా రాఘవేంద్రరావు ఈ సినిమా ముందు వరకు ఎలాంటి కష్టాల్లో ఉన్నాను అనేది చెప్పుకొచ్చాడు. రాఘవేంద్రరావు "జగదేక వీరుడు అతిలోక సుందరి" మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కంటే ముందు నేను దర్శకత్వం వహించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దానితో నాకు అవకాశం ఇచ్చేందుకు కూడా కొంత మంది వెనకాడారు.

అలాంటి సమయంలో చిరంజీవి నాతోనే సినిమా చేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత ఒక మంచి కథతో జగదేక వీరుడు అతిలోక సుందరి చేసాం. అది మంచి విజయం అందుకుంది. ఆ రోజు చిరంజీవి ధైర్యం చేసి నాతో సినిమా చేసి ఉండకపోతే నా కెరియర్ చాలా డేంజర్ పడేది అని రాఘవేందర్రావు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: