
ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలలో నటించే అవకాశాలు వెలుపడ్డాయి.. ఇదే క్రేజ్ తో అటు కోలివుడ్లో కూడా మన సినిమాలలో నటించిన శృతిహాసన్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. అలా వరుస సినిమాలలో నటించిన శృతిహాసన్ బోర్ కొట్టడంతో కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని మరి సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యింది. శృతిహాసన్ తెలుగులో పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చివరి నిమిషంలో నో అని చెప్పడం వంటివి చేస్తూ ఉండడంతో మేకర్స్ చాలామంది శృతిహాసన్ ను పక్కన పెట్టేస్తున్నారట.
కానీ తమిళంలో మాత్రం పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది. తెలుగులో అవకాశాలు ఇస్తున్న తనకు సెకండ్ ఆప్షన్ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నట్టుగా శృతిహాసన్ తీరు చూస్తే కనిపిస్తోందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చివరిగా తెలుగులో సలార్ 1లో నటించింది. ఈ సినిమా భారీ సక్సెస్ అందుకున్న ఆ తర్వాత డెకాయిట్ సినిమాలో నటించి షూటింగ్ మొదలుపెట్టి కొన్ని కారణాలు చేత ఈ సినిమాని రిజెక్ట్ చేసింది. అలా ఇవే కాకుండా రెండు చిత్రాలను కూడా రిజెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో శృతిహాసన్ టాలీవుడ్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. సలార్ 2 లో మాత్రమే నటించేందుకు అవకాశం ఉన్నది. సొంత భాష కి ప్రాధాన్యత ఇస్తున్న శృతిహాసన్ మరి అక్కడ కూడా కొనసాగిస్తుందా లేదా చూడాలి.