పాపం నరేష్ పని అయిపోయిందా..పవిత్ర లోకేష్ నరేష్ ని కూడా వదిలేసి ఆ హీరో మాయలో పడిపోయిందా.. ఇంతకీ పవిత్ర లోకేష్ ఎందుకలా మాట్లాడింది..నరేష్ కంటే ఆ హీరోనే ఇష్టమని పవిత్ర లోకేష్ మాట్లాడిన మాటల్లో ఉన్న అర్థం ఏంటి..ఇంతకీ నరేష్ ని వదిలేసినట్టా కలిసిఉన్నట్టా అనేది ఇప్పుడు చూద్దాం.గత 3 సంవత్సరాల క్రితం నరేష్ పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఇండస్ట్రీలో ఎంత హాట్ టాపిక్ అయిందో చెప్పనక్కర్లేదు. డిజిటల్ మీడియా మెయిన్ ఎక్కడ చూసినా కూడా నరేష్ పవిత్ర లోకేష్ ల గురించి కుప్పలు తెప్పిలుగా వార్తలు వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా పవిత్ర లోకేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు నరేష్ కంటే ముందే ఆ హీరో ఇష్టమని,ఆ హీరోనే నా క్రష్ లవ్ అంటూ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరి ఇంతకీ నరేష్ కంటే పవిత్ర లోకేష్ కి ఇష్టమైన ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.పవిత్ర లోకేష్ కి ఇష్టమైన హీరో ఎవరో కాదు నాగార్జుననే. చిన్నప్పటి నుండే పవిత్ర లోకేష్ నాగార్జున ని ఇష్టపడిందట.అలా తన ఫస్ట్ క్రష్ నాగార్జున అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నరేష్ నీ ప్రేమించే కంటే ముందే నాగార్జునని చూస్తే ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ప్రకాష్ రాజ్ ని చూస్తే కూడా అలాంటి ఫీలింగే కలిగిందని ప్రకాష్ రాజ్ కూడా నాకు చాలా ఇష్టం అంటూ పవిత్ర లోకేష్ బోల్డ్ కామెంట్లు చేసింది.

ఇక పవిత్ర లోకేష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవిత్ర లోకేష్ నిజంగా పెద్ద కిలాడినే, నరేష్ ని పక్కన పెట్టుకొని నా ఫస్ట్ క్రష్ నాగార్జున అని చెప్పింది.అయితే హీరో కాబట్టి అందరికీ అలాంటి క్రష్ ఉంటుంది. కానీ ప్రకాష్ రాజ్ మీద కూడా నాకు అలాంటి ఫీలింగే ఉంది అని చెప్పడం మాత్రం చాలా మందికి నచ్చడం లేదు. అంతేకాదు నువ్వు నరేష్ ని కూడా మధ్యలోనే వదలేస్తావ్ అంటూ కూడా కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికి పవిత్ర లోకేష్ నరేష్ కంటే ముందు నాకు ఆ ఇద్దరు నటులు ఇష్టం అని చెప్పడం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: