"ఆర్య".. ఇది ఒక పేరే కాదు . ఒక ఎమోషన్.  మరీ ముఖ్యంగా వన్ సైడ్ లవర్స్ కి ఆర్య అనే సినిమా ఎంత బాగా కనెక్ట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆర్య సినిమాను చూసి వన్ సైడ్ లవ్ స్టోరీ ఎంత పాపులర్ అయ్యిందో..  వాళ్ళు ప్రేమలో విడిపోయినాక ఎలా ఉండాలి అనేది ఆర్య 2 సినిమా చూశాక చాలామంది నేర్చుకున్నారు అంటూ అప్పట్లో లవర్స్ బాగా డీప్ గా క్లారిటీ ఇస్తూ మాట్లాడుకున్నారు.  కాగా ఆర్య 1 ఆర్య 2 రెండు సినిమాలు కూడా మంచి హిట్ అందుకున్నాయి.  మరీ ముఖ్యంగా "వన్ సైడ్ లవ్ " అంటూ ఆర్య "మై లవ్ ఈజ్ గాన్" అంటూ ఆర్య 2 రెండు కూడా బాగా హిట్ టాక్ అందుకుని.. మంచి కలెక్షన్స్ రాబట్టాయి .
 

అయితే ఆర్య 2 తర్వాత ఆర్య త్రీ సినిమా రావాలి అంటూ బన్నీ ఫ్యాన్స్ ఎక్కువగా డిమాండ్ చేశారు . కానీ సుకుమార్ మాత్రం దానిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించలేకపోయాడు.  మిగతా ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండిపోయి ఆర్య త్రీ పై కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు . కాగా ఇప్పుడు ఆర్య 3 త్వరలోనే రాబోతుంది అన్న వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . దానికి కారణం ఈ సినిమా టైటిల్ ని దిల్ రాజు రిజిస్టర్ చేయించడమే . ఆర్య 3 సినిమా టైటిల్ ని  దిల్ రాజు రిజిస్టర్ చేయించినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది .



శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఫిలిం ఛాంబర్ లో ఆర్య త్రీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించారు అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా భవిష్యత్తులో ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వడానికే ఇలా చేశారు అని  అంటున్నారు అభిమానులు. కానీ అల్లు అర్జున్ ని హీరోగా ఎక్స్పెక్ట్ చేయలేము అని అల్లు అర్జున్ లుక్స్ రేంజ్ మొత్తం ఇప్పుడు మారిపోయాయి . అల్లు అర్జున్ లవర్ బాయ్ గా కనిపిస్తే జనాలు ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేరు . అల్లు అర్జున్ అంటే అందరికీ పుష్పరాజ్ నే గుర్తొస్తాడు . అయితే అల్లు అర్జున్ కాకుండా ఈ సినిమాలో హీరోగా ఎవరు బాగుంటారు అని డిస్కషన్స్ మొదలయ్యాయి .



చాలామంది ఈ సినిమాలో హీరోగా సిద్దు జొన్నలగడ్డ బాగుంటాడు.. నాటి యాంగిల్ లో బాగా అదరకొడతారు అని మాట్లాడుకుంటున్నారు.  అయితే హీరోయిన్ క్యారెక్టర్ కోసం మాత్రమే శ్రీలీల మాత్రమే  సూట్ అవుతుంది అని . శ్రీలీల కన్నా యంగెస్ట్ బ్యూటీ ఇంకా ఇండస్ట్రీలోకి ఎవ్వరు రాకపోవడంతోనే  ఆమె ఈ పాత్రకి సూట్ అవుతుంది అని అంతా మాట్లాడుకుంటున్నారు. ఒక్కవేళ్ల శ్రీలీలకి మించిన ఫిగర్ వస్తే మాత్రం..నో డౌట్ ఆమెనే ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకుంటారు.  మరి ఈ సినిమా]ని డైరెక్ట్ చేసే ఛాన్స్ సుకుమార్ కే ఇస్తారా..? లేకపోతే కొత్త డైరెక్టర్ కి ఇస్తారా ..? అన్నది తెలియాల్సి ఉంది.  దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్సే ప్రారంభమయ్యాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: