ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు బుల్లి రాజు. ఈ కుర్రాడి అసలు పేరు  రేవంత్ బీమల అయినప్పటికీ బుల్లి రాజు గానే భారీ క్రేజ్ అందుకున్నారు. ఈ సినిమా 300 కోట్ల క్లబ్లో అడుగు పెట్టడానికి బుల్లి రాజు పాత్ర చాలా కీలకమని కూడా చెప్పవచ్చు. ఇప్పటికీ ఎన్నో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి .రోజుకి 50 వేల రూపాయలు ఇచ్చి మరి ఈ బుల్లి రాజు కోసం చాలా మంది దర్శకనిర్మాతలు కాల్ సీట్లను ఇవ్వడానికి పోటీ పడుతున్నారట.


ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ,అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో బుల్లి రాజు నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలుబడలేదు. చిరంజీవి, నయనతార కాంబినేషన్లో వస్తున్న కామెడీ సినిమా కావడం చేత కచ్చితంగా బుల్లి రాజు ఇందులో నటిస్తారనే నమ్మకం  మెగా అభిమానులలో కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా అనిల్ రావు స్టోరీ చెబుతున్నప్పుడే అటు హీరోయిన్ నయనతార కూడా పడి పడి నవ్వడం చూపించారు దీంతో కచ్చితంగా బుల్లి రాజు కూడా ఉంటారని ధీమా మొదలవుతున్నది. ఒకవేళ ఇందులో బుల్లి రాజు ఉంటే చిరంజీవి బుల్లి రాజు మధ్య కామెడీ వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.


ఇక చిరంజీవి కూడా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అభిమానులను నవ్వించగలిగిన సత్తా కూడా ఉన్నది. ఆ సత్తాకు బుల్లి రాజు కామెడీ తోడైతే థియేటర్లో కచ్చితంగా నవ్వులు పూయిస్తాయని అభిమానులు నమ్ముతున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్, బుల్లి రాజు మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా ఆ సినిమాకే హైలైట్ గా అయ్యాయి. ప్రస్తుతం చిరంజీవి సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి 157 వ సినిమా బజ్ మాత్రం భారీగానే ఏర్పడింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: