మంచి గుర్తింపు పొందిన నిర్మాతలలో ఏ ఏం రత్నం ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను నిర్మించి అందులో ఎన్నో మూవీ లతో మంచి విజయాలను అందుకొని నిర్మా త గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఖుషి , బంగారం సినిమాలను కూడా నిర్మించాడు. ఈ రెండు సినిమాలలో ఖుషి మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోగా బంగారం సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన హరిహర వీరమల్లు సినిమాను ఏ ఏం రత్నం నిర్మించాడు. ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా మరియు దర్శకుడిగా సత్యాగ్రహి అనే ఓ మూవీ అనౌన్స్మెంట్ వచ్చే ఆగిపోయిన విషయం మనకి తెలిసిందే. ఆ మూవీ కి కూడా ఏం రత్నం నిర్మాత. ఇకపోతే తాజాగా ఏం రత్నం "సత్యాగ్రహి" సినిమా ఎందుకు ఆగిపోయింది అనే విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా ఏ ఏం రత్నం మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ తో ఖుషి , బంగారం సినిమాలను రూపొందించాను.

ఆ తర్వాత ఆయన హీరోగా ఆయన దర్శకత్వంలో సత్యాగ్రహి అనే సినిమా చేయాలి అనుకున్నాం. కానీ ఆయన హీరోగా నటించడం మరియు దర్శకత్వం కూడా వహించాల్సి ఉండడంతో కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత వేదలం సినిమాని రీమేక్ చేయాలి అనుకున్నాం. అది కూడా కుదరలేదు. ఇక క్రిష్ చెప్పిన ఒక పాయింట్ బాగా నచ్చడంతో హరిహర వీరమల్లు టైటిల్ తో ఈ మూవీ ని రూపొందించాం అని ఏ ఏం రత్నం చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: