మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. ఈ సినిమా ఇంకా విడుదలే కాలేదు. కానీ అప్పుడే చిరు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడిని లైన్ లో పెట్టేశారు. `మెగా 157` వర్కింగ్ టైటిల్ తో ఉగాది నాడు పూజా కార్య‌క్ర‌మాల‌తో వీరి చిత్రం ప‌ట్టాలు కూడా ఎక్కింది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీలో హీరోయిన్ గా ఎంపిక అయింది. త్వరలోనే రెగ్యులర్ షూట్‌ స్టార్ట్ కాబోతోంది.


అయితే తాజాగా `మెగా 157` పై ఓ క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. చిరు, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇది. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులను మిస్మరైజ్ చేసేందుకు అనిల్ రావిపూడి గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా చిరంజీవి లుక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. అన్న‌ట్లు అనిల్ సినిమాలో చిరు వింటేజ్ లుక్‌లో క‌నిపించ‌నున్నార‌ట‌.


అవును, వింటేజ్ టచ్ తో వీలైనంతవరకు చిరంజీవి స్టైలిష్ గా ప్రెజెంట్ చేసే ప్లానింగ్ లో అనిల్ రావిపూడి ఉన్నాడట. అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం చిరంజీవికి లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. ఆయ‌న లుక్ చిత్ర బృందాన్ని అద్భుతంగా సంతృప్తి ప‌ర‌చ‌డంతో.. అదే లుక్ ను లాక్ చేశారని సమాచారం అందుతోంది. కాగా, మెగా 157 చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల కానుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: