తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభించిన కొత్తలో వరుస పెట్టి భారీ విజయాలను అందుకుంటూ వచ్చాడు. దానితో ఈయన చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన దర్శకుడి స్థాయికి చేరుకున్నాడు. ఇలా కెరియర్ ప్రారంభంలో ఎన్నో విజయాలను అందుకొని దర్శకుడిగా ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఈయనకు ఈ మధ్య కాలంలో సరైన విజయం దక్కడం లేదు. ఆఖరుగా పూరి జగన్నాథ్ , రామ్ పోతినేని హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా డబల్ ఇస్మార్ట్ అనే మూవీ ని రూపొందించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే పూరీ జగన్నాథ్ తన తదుపరి మూవీ ని తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతి తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు , ఆ టైటిల్ ను మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

తాజాగా విజయ్ సేతుపతిప్రెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ ... నేను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాను. ఆ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ మేము ఇప్పటివరకు ఆ సినిమాకు ఏ టైటిల్ను కూడా ఫిక్స్ చేయలేదు. పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నీ చూసా. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ అని విజయ్ సేతుపతి తాజా ప్రెస్ మీట్ లో బాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs