లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ గత కొన్ని సంవత్సరాలుగా వరుస పెట్టి అపజయాలను అందుకుంటూ వచ్చాడు. అలాంటి సమయంలోనే ఈయన లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో ఒక్క సారిగా కమల్ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం కమల్ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కమల్ హాసన్ , మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శింబు ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇకపోతే తాజాగా కమల్ హాసన్ "థగ్ లైఫ్" మూవీ ఎప్పుడు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా కమల్ హాసన్ మాట్లాడుతూ ... థగ్ లైఫ్  మూవీ విడుదల అయిన ఎనిమిది వారాల తర్వాతే ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తుంది అని చెప్పుకొచ్చాడు. అలాగే థియేటర్లలో విడుదల అయ్యే మూవీల విలువలను కాపాడడానికి తీసుకోవాల్సిన వ్యూహాత్మకమైన మరియు అవసరమైన నిర్ణయం ఇది అని కమల్ పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీ బాగుపడుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే ఇప్పటివరకు థగ్ లైఫ్ మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: