మన తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద ఫ్యామిలీలో మంచు కుటుంబం కూడా ఒకటి . ఈ ఫ్యామిలీలో మంచు మనోజ్, మంచు విష్ణుకు మధ్య జరుగుతున్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే .. అయితే మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుతో జరుగుతున్న కుటుంబ వివాదాల నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో ఆవేదన భావోద్వేగంతో మాట్లాడారు .. అందులో మనోజ్ మాట్లాడుతూ వెళ్లి నాన్న కాళ్లు పట్టుకోవాలని నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఇప్పటికీ ఉంది .. కానీ చేయని తప్పుని అంగీకరిస్తే నా పిల్లలకు నేనేం నేర్పిస్తా మా నాన్న నేర్పించిన నీతి ఇది అందుకే నేను ముందుకు వెళ్ళలేకపోతున్న మేమంతా మళ్లీ కలిసి ఉండాలని రోజు దేవుని కోరుకుంటున్నా .. 


ఇలా మ‌ద్య ఈ సమస్యలు సృష్టించిన వారు తమ తప్పుని తెలుసుకుంటారని నమ్మకం ఉంది అని మనోజ్ అన్నారు . అయితే ఈ ఇంటర్వ్యూలో మనోజ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తన తండ్రి పట్ల ఉన్న గౌరవం ప్రేమ ఉన్నప్పటికీ కుటుంబంలో జరుగుతున్న విభేదాల కారణంగా ఆయన మనసు ఎంతగానో చితికిపోయి బాధపడిందో అందరూ అర్థం చేసుకోవచ్చు .. అయితే ఈ వివాదాలు ఆస్తి  సంబంచిన తగాదాలు కాదని ఆత్మగౌరవం నీతి సంబంధిత విషయాలపై తన పోరాటమని మనోజ్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు .. అలాగే ఆయన తన తండ్రి నేర్పిన నీతి విలువలను పాటిస్తూ చేయని తప్పు విషయంలో క్షమాపణ చెప్పేది లేదని అలా చేస్తే తన పిల్లలకు తప్పుడు సందేశం వెళ్తుందని మనోజ్ అంటున్నారు .


 అలాగే మనోజ్ తన కుటుంబ సమస్యలను  పరిష్కరించుకోవాలని, అందరూ కలిసి ఉండాలని కోరుకున్నట్లు చెప్పుకొచ్చారు .. అయితే ప్రస్తుతం మనోజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు .. త్వరలోనే ఆయన నటించిన‌ భైరవం సినిమా రిలీజ్ కి రాబోతుంది .. విజయ్ కనకమడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ , నారా రోహిత్ , మనోజ్ కలిసిన నటించారు . మే 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని మనోజ్ అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: