- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ లో సూపర్ స్టార్ల సీనియర్ హీరోల సినిమాలకు సంబంధించి నెంబర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. అయితే సినిమాలు తేడా అయితే ఎవరు మునుగుతారో అర్థం చేసుకోవడం కూడా కష్టం. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి సినిమా లెక్కలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు అని చెబుతున్నారు. ప్రమోషన్ కోసం పాతిక కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మొత్తం బడ్జెట్ రు. 375 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ 375 కోట్ల రూపాయలు మేకింగ్ ఛార్జ్ ఏమీ కాదు .. ఇందులో ఎక్కువ భాగం రజనీకాంత్ రెమ్యూనరేషన్. రజనీకాంత్ ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యున రేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు లోకేష్ కనకరాజుకు 50 కోట్ల రూపాయల ఇచ్చారని సమాచారం. ఈ రెండూ కలిపి 200 కోట్లకు ఖర్చు పెట్టారు. ప్రమోషన్ కు 25 కోట్లు అంటే మిగిలిన 150 కోట్లతో మొత్తం సినిమాతో పాటు ఇతర తారల రెమ్యున రేషన్ ఉంటుంది. ఇక 350 కోట్ల రూపాయల వ్యయంలో ప్రధాన అంశాలు అలా ఉంటే రిటర్న్స్ విషయానికొస్తే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. అయినా కూడా రిటర్న్స్ భారీగా ఉన్నట్టు తెలుస్తోంది.


సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏకంగా 130 కోట్ల రూపాయలతో ఒక ఓటిటి సంస్థ సొంతం చేసుకుందట. ఇక శాటిలైట్ రైట్స్ 90 కోట్ల రూపాయలకు .. మ్యూజిక్ రైట్స్ మరో 20 కోట్ల రూపాయలు .. ఇలా డిజిటల్ , శాటిలైట్ రైట్స్ తోనే 240 కోట్ల రూపాయల రిటర్న్స్‌ దక్కుతున్నాయి. మొత్తం రు. 375 కోట్లలో 240 కోట్ల రూపాయలు ఇలా రిటర్న్ అయితే .. ఇంకో 135 కోట్ల రూపాయలు థియేటర్ నుంచి పొందినా సినిమా కచ్చితంగా సక్సెస్ఫుల్ వెంచర్ అవుతుంది. మ‌రి థియేట్రిక‌ల్‌గా ఇప్పుడు రు. 135 కోట్ల టార్గెట్‌తో కూలీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. అయితే సినిమా తేడా కొడితే మాత్రం అంద‌రూ గ‌ట్టిగానే మునిగి పోతారు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: