మెహ్రీన్ పిర్జాదా.. వెండితెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. పంజాబ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ 2016లో `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` మూవీతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. తొలి చిత్రంతోనే తనదైన అందం, అభినయంతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది.
`మహానుభావుడు`, `రాజా ది గ్రేట్` వంటి చిత్రాలు మెహ్రీన్ కెరీర్ కు మరింత మైలేజ్ ఇచ్చాయి. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు మెహ్రీన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ బ్యూటీ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేసింది. అయితే 2021 నుంచి మెహ్రీన్ కెరీర్ డ‌ల్ అవుతూ వచ్చింది.
2002లో `ఎఫ్3` మూవీతో హిట్ పడినా ఆమె మునుప‌టి జోరును చూపించలేకపోయింది. చివరిగా 2023లో `స్పార్క్ లైఫ్` మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించింది. అయితే ఈ సినిమా అసలు ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియని పరిస్థితి.
ఆ తర్వాత మెహ్రీన్ ఆన్ స్క్రీన్ పై కనిపించలేదు. అవకాశాలు రావడం లేదో లేక వచ్చిన కథలు న‌చ్చ‌డం లేదో తెలియ‌దు గానీ.. మెహ్రీన్ ఫుల్ ఖాళీ అయిపోయింది. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ అమ్మ‌డు య‌మా యాక్టివ్ గా ఉంటోంది.
త‌ర‌చూ వెకేష‌న్స్‌, పార్టీల‌కు వెళ్తూ చిల్ అవుతోంది. తాజాగా ఆస్ట్రియాలో వాలిపోయిన మెహ్రీన్‌.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోల‌ను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది.
రెడ్ క‌ల‌ర్ స్లీవ్ లెస్ టాప్, పైన జాకెట్‌ తో నాభి అందాల‌ను చూపిస్తూ మెహ్రీన్ మ‌తిపోగొట్టేసింది. కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ అయ్యేలా క్రేజీ పోజులిచ్చింది. ప్ర‌స్తుతం మెహ్రీన్ తాజా పిక్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
కాగా, ప్ర‌స్తుతం మెహ్రీన్ చేతిలో ఒకే ఒక్క చిత్రం ఉంది. అదే `నీ సిగూవరేగు`. మెహ్రీన్ కు ఇది తొలి క‌న్న‌డ చిత్రం. ఈ ప్రాజెక్ట్ ప్రారంభ‌మై చాలా ఏళ్లే అయినా ఇంత‌వ‌ర‌కు విడుద‌ల‌కు నోచుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: