
కాగా అలాంటి ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో హీరో ప్రభాస్ ఎక్కువగా ఒకే టైప్ ఆఫ్ జోనర్ లో ఉండే సినిమాలు చూస్ చేసుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా సెల్లార్ సినిమా హిట్ అయింది . కానీ అసలు ప్రభాస్ డైలాగ్స్ ఏవి కూడా హైలెట్ గా మారలేదు . ప్రభాస్ కెరియర్ లో "వర్షం" లాంటి మరొక సినిమాలో ఆయన నటిస్తే చూడాలి అంటూ చాలామంది రెబల్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు కానీ ఎందుకో అది కుదరలేదు. అలాంటి కాన్సెప్ట్ అలాంటి స్క్రిప్ట్ ప్రభాస్ వద్దకు రాలేదు .
కానీ వర్షం సినిమా తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ పేరు మారుమ్రోగిపోయేలా నాటీ రొమాంటిక్ సీరియస్ యాక్షన్ యాంగిల్ ను చూపించబోతున్నాడు ఓ స్టార్ డైరెక్టర్ . ఆయన మరెవరో కాదు హను రాఘవపూడి . మనకు తెలిసిందే హనురాగపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పేరు "ఫౌజి". ఈ కాన్సెప్ట్ టోటల్ డిఫరెంట్ గా ఉంటుందట . ఇప్పటివరకు ప్రభాస్ ని ఇలాంటి క్యారెక్టర్ లో మనం చూడలేదు. అంతేకాదు ఒక లవర్ బాయ్ గా కూడా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడట . బాధ్యతగల పౌరుడిగా అదే విధంగా ప్రేమ కోసం ఏదైనా చేసే ఒక యంగ్ జనరేషన్ కుర్రాడిగా రెండు క్యారెక్టర్స్ లో అదరకొట్టేయబోతున్నాడట. అంతేకాదు వర్షం సినిమా తర్వాత ఆ లెవెల్ లో ప్రభాస్ ని ఈ సినిమాలోనే చూడబోతున్నాం అన్న న్యూస్ ఇప్పుడు వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి ఇన్నేళ్ళకి రెబెల్ ఫాన్స్ కోరిక తీర్చబోతున్నాడు ప్రభాస్. ఫౌజి సినిమాలో ప్రభాస్ ని నాటి యాంగిల్ లో చూస్తే మాత్రం మరో ఐదేళ్లు ప్రభాస్ కి సినిమాల పరంగా ఏ ఢోకానే ఉండదు అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???