
నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిట్ అయ్యిందని అందరూ అనుకున్నారు. వాస్తవంగా చూస్తే ఈ సినిమా కు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కు వచ్చిన వసూళ్లకు ... సినిమా పై ఉన్న అంచనాలతో పోలిస్తే సినిమా హిట్ అయితే కాదు. ఈ సినిమాకు నాలుగు రోజులకే రు. 100 కోట్లు వచ్చినట్టు పోస్టర్లు వేసుకున్నా పలు ప్రాంతాల్లో సినిమా కొన్న వాళ్లకు మిగిలింది లేదు .. లాభం రాలేదు సరికదా ... 10 శాతం వరకు నష్టాలు తప్పలేదట. తాజాగా తాజాగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ కూడా ఈ యేడాది హిట్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ సంక్రాంతికి వస్తున్నాం.. కోర్ట్.. మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు మాత్రమే హిట్లు గా నిలిచాయని అన్నారు. ఈ మూడు సినిమా లే తమను కాపాడాయని .. ఈ మూడు సినిమాల వల్లే సింగిల్ స్క్రీన్లు నిలబడ్డాయన్నారు.
ఈ మూడు సినిమాలు కూడా హిట్ కాకపోయి ఉంటే ఈ పాటికే తాము థియేటర్లను మూసి వేయాల్సి వచ్చేదని. హరిహర వీరమల్లు సినిమా కోసం ఈ నెలంతా థియేటర్లను ఖాళీగా ఉంచామని ... ఇప్పుడు ఆ సినిమాను వాయిదా వేయడంతో మేం ఏం చేయాలని ప్రశ్నించారు. ఏదేమైనా హిట్ 3 సినిమా కూడా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా నిలిచిందనే చెప్పాలి. పేరుకు హిట్లు అని చెప్పుకుంటున్నా లాభాలు రాలేదన్న వాళ్లే ఎక్కువుగా కనిపిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు