
అయితే రిలీజ్ కు ముందు ఈ సినిమా స్టోరీ లీక్ అయింది. సోషల్ మీడియాలో కుబేర కథ ఇదే అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. కథలో ధనుష్ ఒక బిచ్చగాడు. నాగార్జున చార్టర్ అకౌంటెంట్ గా కనిపిస్తాడు. ఈయన బాగా బలిసిన వారి బ్లాక్ మనీని రోడ్ సైడ్ ఉండే బెగ్గర్స్ పేరిట హవాలా చేయిస్తూ మ్యానేజ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే వేల కోట్లకు అధిపతి అయిన జిమ్ సర్భ్ బ్లాక్ మనీలో వంద కోట్లను కొట్టేయాలని నాగ్ ప్లాన్ చేస్తాడు.
అందుకు ఎరగా బిచ్చగాడైన ధనుష్ ను వాడతాడు. అయితే అనుకోకుండా నాగ్ కొట్టేసిన డబ్బు రష్మికకు దొరుకుతుంది. అటు ధనుష్‌కు సైతం నాగార్జున ప్లాన్ తెలిసిపోతుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎటువంటి ఫైట్ నడిచింది? రష్మిక తనకు దొరికిన డబ్బు ఎక్కడ దాచించి? తన డబ్బు కొట్టేసిన నాగ్‌ను జిమ్ సర్భ్ ఏం చేశాడు? అన్నదే కుబేర స్టోరీ అని ప్రచారం జరుగుతోంది. కథలో భాగంగా వచ్చే ట్విస్ట్‌లు, టర్నింగ్ పాయింట్లు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల యొక్క రక్తికట్టించే స్క్రీన్ ప్లే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కుబేర బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించడం ఖాయమని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.