
ఇక మూడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ.. అలాగే నాలుగవ స్థానంలో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ వంటి చిత్రాలు ఉన్నాయట. మొత్తానికి పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణ అఖండ 2 సినిమా నీ రిలీజ్ చేయబోతున్నారు. కానీ టీజర్ లో బాలకృష్ణని చూసి చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. బాలయ్య గెటప్పులను చూసి చాలామంది ఆశ్చర్యపోవడమే కాకుండా మరి కొంతమంది నెగిటివ్గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో విలన్ గా ఆది పినిశెట్టి కనిపించబోతున్నారు. అలాగే సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ఇప్పటివరకు బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఏ సినిమా కూడా ఫెయిల్యూర్ కాలేదు.
అఖండ 2 సినిమా ఇప్పటికే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.. అలాగే ఓటీటి రైట్స్ కూడా భారీగానే అమ్ముడుపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ రెమ్యూనరేషన్ కూడా అధికంగానే తీసుకున్నట్లు సమాచారం. మరి ఏడాది విడుదలై ఇలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ట్రైలర్ కోసం మరింత ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు ఫాన్స్.