ఏంటి అక్కినేని నాగార్జునను అక్కినేని అభిమానులే పచ్చి బూతులు తిడుతున్నారా.. ఇంతకీ నాగార్జున చేసిన తప్పేంటి ..ఎందుకు ఆయన్ని తిడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.నాగార్జున ముఖ్యపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర.. ధనుష్ హీరోగా రష్మిక హీరోయిన్ గా చేసిన ఈ సినిమాలో నాగార్జున ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపిస్తారు. అయితే ఈ సినిమాలో నాగార్జున కి భారీ హైప్ ఇచ్చారు.కానీ తీరా సినిమా చూస్తే అంతగా ఏమీ లేదు. ఒక 15 నిమిషాలు నాగార్జున గురించి ఇంట్రెస్టింగ్ గా ఆయనకు గట్టి పాత్ర ఇచ్చారు అనుకునేలా ఉంది.కానీ ఆ తర్వాత అంతా మామూలే.. ప్రీ క్లైమాక్స్ లో నాగార్జునకి ఎంతోకొంత స్కోప్ ఇచ్చారు. 

కానీ సినిమా మొత్తం నాగార్జున పాత్రకి అస్సలు స్కోప్ లేదు. ఇలాంటి పాత్రలో నాగార్జునని డైరెక్టర్ ఎందుకు చూపించారా అని చాలామంది అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. నాగార్జునకి మంచి పాత్ర ఇచ్చామని చెప్పుకుంటున్న డైరెక్టర్ ని తిట్టిపోస్తున్నారు. అంత పెద్ద హీరోని ధనుష్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని చేసి పారేశారు అంటూ ఫైర్ అవుతున్నారు.అంత పెద్ద హీరోని ఇలాంటి చిన్న పాత్రలో చూపించినప్పుడు ఆయన అభిమానులు నిరాశపడతారు బాధపడతారు అనే జ్ఞానం కొంచెం కూడా మీకు లేదా అంటూ డైరెక్టర్ ని తిడుతున్నారు. ప్రకాష్ రాజ్,జగపతిబాబు వంటి ఆర్టిస్టులు చేయాల్సిన పాత్రని నాగార్జునకి ఇచ్చారు అంటూ తిట్టి పోస్తున్నారు. 

ఇక అక్కినేని వీరాభిమానులైతే నాగార్జునని ధనుష్ వెనుక నుండి వచ్చి కొట్టే సీన్ మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇక కొంతమంది అయితే ట్విట్టర్ వేదికగా తమ బాధ వెళ్లగక్కుతున్నారు. తాజాగా ట్విటర్లో ఒక ఆడియో వైరల్ అవుతుంది. ఆ ఆడియోలో నాగార్జున అభిమాని ధనుష్ నాగార్జున ని కొట్టే సీన్ గురించి మాట్లాడుతూ.. కడుపు రగిలిపోతుంది అన్నా..కుక్కను కొట్టినట్టు కొట్టారు అంటూ మాట్లాడిన ఆడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ కుబేర మూవీ విషయంలో మాత్రం నాగార్జున అభిమానులు చాలా హర్ట్ అయ్యారు అని తెలుస్తుంది. అంతేకాదు నాగార్జున తెలిసి తెలిసి ఇలాంటి పాత్రను ఎందుకు ఒప్పుకున్నారా అని ఆయన్ని కూడా తిడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: