
ఇక ఇప్పుడు తన న్యూ మూవీ ‘ది ఒడిస్సీ’ విషయం లోనూ ఇదే చేశాడు .. సముద్ర నేపథ్యంలో సాగే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన ప్రకటనను సోషల్ మీడియాలో వదిలారు .. . ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ రిలీజ్ సందర్భంగా థియేటర్ లో ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ లాంచ్ కాబోతుంది అంటూ... ఓ ఆసక్తికర పోస్టర్ తో ఈ విషయాన్ని ప్రకటించారు . ప్రపంచ నెంబర్ వన్ డైరెక్టర్ నోలన్ అప్డేట్ ఇవ్వగానే . ఇక ఇప్పుడు ఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్ మీదకి మన ప్రేక్షకుల దృష్టికి వెళ్ళింది .. అది రాజమౌళిని అని అందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . త్రిబుల్ ఆర్ తో పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిన రాజమౌళి . దాని తర్వాత మహేష్ బాబు తో చేస్తున్న సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు .
మామూలుగా తాను సినిమా మొదలుపెట్టే ముందు లేదా మొదలైన కొన్ని రోజులకు ప్రెస్ మీట్ పెట్టి కథ , ఇతర విషయాలు గురించి చెబుతాడు జక్కన్న .. అయితే ఇక్కడ మహేష్ సినిమా విషయంలో మాత్రం అలాంటిది ఏదీ జరగలేదు . షూటింగ్ మొదలై ఆరు నెలలు దాటింది అయినా అధికారికంగా ఏ సమాచారాన్ని బయటకు చెప్పలేదు .. అలాగే రాజమౌళి ఏదైనా ఈవెంట్లో పాల్గొన్న సరే మహేష్ సినిమా గురించి అసలు ఏం మాట్లాడుటలేదు. . అయితే ఈసారి ఎందుకింత గోప్యత పాటిస్తున్నాడో అసలు ఎవరికీ అర్థం కావటం లేదు . ఇప్పటికే చాలా ఆలస్యమైంది .. ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా విషయాలు పంచుకోవటం లేదా సినిమా నుంచి ఏదైనా విషయాన్ని చెప్పుడమో చేయాలని అభిమానులు ఎంతగానో కోరుతున్నారు . అయితే ఇప్పుడు మహేష్ పుట్టినరోజు ఆగస్టు 9కైన టైటిల్ , ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు.